కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య రాకపోకలు స్తంభించిపోవడంతో పాటు అన్ని రకాల క్రీడలు, సినిమాలు, వ్యాపారాలు, రాజకీయాలు నిలిచిపోయాయి. దీంతో సామాన్యులతో  పాటు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇళ్లకే పరిమితమైపోయారు.

దొరక్క దొరక్క ఖాళీ సమయం కుదరడంతో కుటుంబసభ్యులతో గడిపుతూ ఏంజాయ్ చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Also Read:ఐపీఎల్ వల్ల నాకు అవకాశం రాలేదు.. యూవీతో బుమ్రా

అలాగే కుటుంబంతో గడిపిన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ కూడా తన సతీమణి సాక్షి సింగ్, కుమార్తె జీవాలతో కలిసి రాంచీలోని ఫామ్ హౌస్‌లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపటం అంటే చాలా ఇష్టపడే ధోనీ లాక్‌డౌన్ సమయంలో కుమార్తె జీవాను బైక్‌పై ఎక్కించుకుని ఇంటి ఆవరణలోనే చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Also Read:ఫామ్ లో ఉన్నప్పుడే తొక్కేశారు, ధోనీ మాత్రం... ఆర్పీ సింగ్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన క్రికెటర్‌ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ధోనీ ఇల్లు... ఒక డ్రీమ్ హౌస్‌లా ఉందని పలువురు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత పరిస్ధితులను బట్టి ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.