టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. చుక్కలు చూపించాడు. గతంలో బుమ్రా.. యార్కర్లతో తనను ఇబ్బంది పెట్టాడని చెప్పిన యూవీ.. తాజాగా.. బుమ్రాకి చుక్కలు చూపించాడు. తన ప్రశ్నల తో బుమ్రాని ఉక్కిరిబిక్కిరి చేశాడు.

వీరిద్దరూ కలిసి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో రాగా.. యూవీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బుమ్రా నానా తిప్పలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో భాగంగా ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో బుమ్రాను ఆడేసుకున్నాడు. ప్రతీ ప్రశ్నకు ఐదు సెకన్ల సమయం మాత్రమే ఇచ్చి సమాధానాలు రాబట్టాడు యువీ.

కోహ్లీ, సచిన్ లలో అత్యంత అద్భుతమైన బ్యాట్స్ మెన్ ఎవరు అని యూవీ ప్రశ్నించగా.. వీరిలో ఎవరు ఉత్తమం అనే జడ్జ్‌ చేసేంత క్రికెట్‌ నేను ఇంకా ఆడలేదు. వారు నా కంటే ఎక్కువ క్రికెట్‌ ఆడారు. నేను నాలుగేళ్లుగా మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాను. ఈ ప్రశ్నకు జవాబు  చెప్పడం కష్టం అని బుమ్రా సమాధానం ఇచ్చాడు.

ఒక ఐపీఎల్ గురించి యూవీ అడిగిన ఓ ప్రశ్నకు కూడా బుమ్రా సమాధానం ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో నా ఆటతీరు ఆధారంగా నాకు టీమ్ ఇండియాలో చోటు దక్కింది అని ప్రజలు అనుకుంటారని, అయితే భారత తుది జట్టులోకి రావడానికి అది అసలు కారణం కాదని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు.

  దేశీయ మ్యాచ్‌ల్లో తన స్థిరమైన ఆటతీరు తనకు సీనియర్ జట్టులోకి రావడానికి సహాయపడింది కానీ ఐపీఎల్ కాదు అని బుమ్రా అన్నారు. 2013 లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన తరువాత బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్  ద్వారా వెలుగులోకి వచ్చాడు. 

అప్పటి 19 ఏళ్ల బుమ్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో జరిగిన తొలి మ్యాచ్ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. అయితే " ఐపీఎల్ లో నా ఆటతీరు ద్వారా నేను భారత జట్టులో చేరాను అనేది వాస్తవం కాదు. 2013 లో నేను ఐపీఎల్ లోకి వచ్చినప్పుడు ముంబై ఇండియన్స్ కోసం 2013, 2014, 2015 సీజన్లలో నేను క్రమం తప్పకుండా ఆడటం లేదు. అయితే నేను విజయ్ హజారే ట్రోఫీలో బాగా రాణించాను, ఆ తరువాత నేను 2016 లో భారత జట్టులోకి వచ్చాను