2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అభిమానులకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లాక్‌డౌన్ కారణంగా కనిపించడం కూడా కష్టంగా మారింది. బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా గడిపే భారత క్రికెటర్లు కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కానీ ధోనీ దర్శనం మాత్రం కరువైంది.

Also Read:కొడుకుతో కలిసి సానియా నిద్రలేచే క్యూట్ ఫోటో.... నెట్టింట వైరల్!

అయితే తాజాగా అతని కొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. తన గారాలపట్టి జీవాతో, తన పెట్ డాగ్‌తో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతున్న వీడియోను ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

దాదాపు రెండు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ధోనీ లుక్ నెట్టింట చర్చనీయాంశమైంది. మామూలు టీషర్ట్, లూజ్ ప్యాంట్‌లో, నెరిసిన సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ గడ్డంలో కనిపించాడు ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు మిస్టర్ కూల్.

Also Read:ఐసీసీ చైర్మన్ రేసులో సంగక్కర, గెలిపించుకునేందుకు లంక ప్లాన్ ఇదీ..!

కాగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ -2020 సీజన్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ - నవంబర్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#runninglife post sunset !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on May 8, 2020 at 6:53am PDT