కొడుకుతో కలిసి సానియా నిద్రలేచే క్యూట్ ఫోటో.... నెట్టింట వైరల్!

భారత ఏస్ టెన్నిస్ స్టార్, మన హైద్రాబాదీ సానియా మీర్జా సోషల్ మీడియాలో తన కొడుకుతో ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఇలా మేమిద్దరం నిద్ర లేచామని, ఇంతకన్నా వేరే ఏ బెస్ట్ పోజ్ కూడా ఉండదు అనే అర్థమొచ్చే విధంగా ట్విట్టర్ వేదికగా ఫోటో పోస్ట్ చేసారు. 

We Woke Up Like This: Sania Mirza Posts Cute Picture With Son Izhaan

భారత ఏస్ టెన్నిస్ స్టార్, మన హైద్రాబాదీ సానియా మీర్జా సోషల్ మీడియాలో తన కొడుకుతో ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఇలా మేమిద్దరం నిద్ర లేచామని, ఇంతకన్నా వేరే ఏ బెస్ట్ పోజ్ కూడా ఉండదు అనే అర్థమొచ్చే విధంగా ట్విట్టర్ వేదికగా ఫోటో పోస్ట్ చేసారు. 

ఒక్కసారిగా సానియా మీర్జా ఇలా తన కొడుకు ఇజాన్ తో ఉన్న ఫోటో ను పోస్ట్ చేయగానే అభిమానులంతా ఆ ఫోటోని లైకులతో ముంచెత్తారు. ఈ లాక్ డౌన్ కాలంలో ఇతర సెలెబ్రెటీల్లాగానే సానియా మీర్జా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయింది. 

కెరీర్ పరంగా చూసుకుంటే..... తల్లైన తరువాత వచ్చి రావడంతోనే హోబర్ట్ ఇంటర్నేషనల్ సాధించి తన సత్త చాటింది. ప్రపంచ గ్రూప్స్ కు అర్హత సాధించి ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్నవేళ కరోనా మహమ్మారి రూపంలోప్ తన కెరీర్ పై పెద్ద బండరాయి పడినట్టు అనిపిస్తుందంటున్న భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మనోగతం. 

తాను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్‌ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది. 

2021 అంటే ఇంకా చాలా దూరం ఉందని, అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుందని, దానికి సమయం పట్టడం సహజమని సానియా వ్యాఖ్యానించింది. 

టోర్నీల్లో  గెలుపోటములు ఉంటాయన్నా విషయం తనకు తెలుసునని, ఆ స్థాయిలో ఆడేందుకు, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే వచ్చానని, కానీ ఇప్పుడు అంతా మారిపోతుందని, ఆటలో లయ తప్పుతుంది కాబట్టి మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుందని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. 

 అంతా మంచిగా సాగితే మళ్లీ ఆడతానని, కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోననే భయంగా ఉందని తన మనసులోని ఆందోళనలను బయటపెట్టింది. సానియా ప్రస్తుత వయసు 33. 2021 ఒలింపిక్స్ నాటికి 35వ  పడిలో నుంచి 36వ పదిలోకి అడుగుపెట్టేందుకు మరో మూడు నాలుగు నెలల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా తన వయసుకు సంబంధించి ఆందోళన చెందుతుంది. 

కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనప్పటికీ.... ఆటలో పాత పద్ధతులకు బదులుగా అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని సానియా వ్యాఖ్యానించింది. ‘

ఖచ్చితంగా అంతా మారిపోతుందని, ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేకపోవచ్చు కానీ...  క్రీడలను అటుంచితే, సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయమని సానియా అభిప్రాయూయపడింది. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని,  ఇప్పటికే చాలా మారిపోతోందని, ఎందరినో కలుస్తున్నా.... ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేకపోతున్నామని, క్రీడలు కూడా చాలా మారిపోతాయని సానియా మీర్జా వాఖ్యానించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios