ఇరు జట్లు ఇప్పటికే పింక్ బాల్‌తో ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

టీమిండియా తొలిసారి పింక్ బాల్ టెస్టుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్‌లో ఈడెన్ గార్డెన్‌లో ప్రారంభం కానున్న డే అండ్ నైట్ టెస్టులో భారత జట్టు తలపడనుంది. అయితే పింక్ బాల్‌తో డే అండ్ నైట్ టెస్టుల అనుభవం లేని భారత జట్టు ఎంత మేరకు రాణిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా పింక్ బాల్ టెస్టు ఎంత వరకు రాణిస్తుందో అనే దానిపై ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:బంతిని షైన్ చేయొద్దన్నందుకు: గ్రౌండ్‌లోనే సహచరుడిని లాగి కొట్టిన క్రికెటర్

ఇరు జట్లు ఇప్పటికే పింక్ బాల్‌తో ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

రహానె బెడ్‌ మీద పడుకుని ఉండగా.. ఆ పక్కనే పింక్ బంతిని పెట్టుకుని ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అంతేకాకుండా చారిత్రక పింక్ బాల్ టెస్ట్ కోసం కలలు కనడం మొదలు పెట్టేశా అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Also Read:తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్న ముక్కు పంక్చర్

దీనిపై టీమిండియా సహచర ఆటగాళ్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు రహానేను ఆట పట్టించారు. ‘‘చాలా మంది పోజు.. బాగుంది జింక్సీ’’ అంటూ కోహ్లీ బదులిచ్చాడు. ధావన్ అయితే ‘‘ ఈ పిక్చర్ తన కలలో వచ్చిందే’’ అంటూ సెటైర్ వేశాడు. ఈ క్రమంలో తనకు పింక్ బాల్ టెస్ట్ ఆడాలని ఉందని చెప్పకనే చెప్పేశాడు ధావన్.

కాగా మయాంక్ అగర్వాల్- రోహిత్ శర్మల జోడి టెస్ట్ ఫార్మాట్‌లో ఓపెనర్లుగా సక్సెస్ కావడంతో కేఎల్ రాహుల్- శిఖర్ ధావన్‌లకు టెస్టుల్లో ఛాన్సులు రావడం లేదు. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో గబ్బర్ భారత్ తరపున చివరిసారిగా టెస్టు జెర్సీ వేసుకున్నాడు. 

View post on Instagram