కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలు వాయిదాపడ్డాయి. దీంతో క్షణం తీరిక లేకుండా గడిపే క్రికెటర్లంతా కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు. వంట చేయడం, బట్టలు ఉతకడం, గార్డెనింగ్ వంటి పనులు చేసి పెడుతూ సాయం చేస్తున్నారు.

ఇక అన్నింటి కంటే ముఖ్యంగా జుట్టు బాగా పెరిగిపోవడంతో పురుష పుంగవులు ఎదుర్కొంటున్న బాధ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో వారి భార్యల చేత కటింగ్ చేయించుకుంటున్నారు పలువురు క్రికెటర్లు.

Also Read:లాక్ డౌన్ సడలింపులు.. క్రికెట్ కి గ్రీన్ సిగ్నల్ పై ద్రవిడ్ స్పందన

ఇప్పటికే విరాట్ కోహ్లీకి ఆయన సతీమణి అనుష్క శర్మ హెయిర్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర పుజారా తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే భార్యతో హెయిర్‌కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని ధైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Also Read:నా సెలక్షన్ కి మా నాన్నని లంచం అడిగారు.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్

దీనికి సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ స్పందించాడు. మంకీతో ఉన్న ఓ ఎమోజీని పెట్టి పుజారాతో తాను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. కాగా టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన ఛతేశ్వర్ పుజారా 48.86 సగటుతో 5,840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబులు సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి.