ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్లలో అత్యధిక విమర్శలు ఎదుర్కుంటున్న వారెవరన్న ఉన్నారంటే... అది ఖచ్చితంగా విరాట్ కోహ్లీని! నెక్స్ట్ మ్యాచులోనన్నా ఆడతాడులే అని అనుకుంటున్నా అభిమానులకు నిరాశే ఎదురవుతుంది. 

క్రికెట్ విశ్లేషకులు కూడా కోహ్లీ పేలవమైన ఫామ్ పై పెదవి విరుస్తున్నారు. సాధారణంగా కవర్ డ్రైవ్ లను అసాధారణంగా ఆడే కోహ్లీ న్యూజీలాండ్ పై మాత్రం ఎందుకో ఆ షాట్లను ఆడలేకపోతున్నాడు. 

న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు (రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో కూడా విరాట్ అవుట్ అయ్యాడు) విరాట్ కోహ్లి.. కేవలం ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే చేశాడు.  

Also read: "వంట నేర్చుకుంటున్నా"నంటున్న అజింక్య రహానే పర్సనల్ ఇంటర్వ్యూ

తన ఇంతటి లాంగ్ కెరీర్ లోనే ఒక సిరీస్‌లో కోహ్లి ఇంత దారుణంగా విఫలం కావడం ఇదే ఫస్ట్ టైం. ఇలా కోహ్లీ విఫలమవడంపై అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు.... కోహ్లీ ఎందుకు విఫలమవుతున్నాడో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా భారత మాజీ ఆటగాడు, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా కోహ్లీ వైఫల్యం పై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు దిగకపోవడం వల్లే కోహ్లి విఫలమై ఉంటాడని తాను భావిస్తున్నానని ఈ మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. 

ప్రత్యర్థులు ఏ మాత్రం కవ్వించినా కోహ్లి చాలా బాగా ఆడతాడని, ఇప్పుడు న్యూజిలాండ్‌ పర్యటనలో అతన్ని ఎవరూ రెచ్చగొట్టకపోవడం వల్లే ఇలా నిరాశపరుస్తున్నాడా అనే అనుమానాన్ని గంభీర్‌ వ్యక్తం చేశాడు. 

కోహ్లిని కవ్వించకపోవడం వల్లే అతగాడు విఫలం అవుతున్నాడనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.... ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు మాత్రం కోహ్లి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయన్నాడు.

Also read: ఆసియా కప్: గంగూలీ ప్రకటనపై భగ్గుమన్న పాక్ బోర్డు చైర్మన్

న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా సౌమ్యులని, వారిని చూస్తే కవ్వింపులకు దిగే ఆస్కారం కనబడడం లేదని,  వారు కోహ్లీని రెచ్చగొట్టే పనులు ఒక్కటీ చేయలేదని, అదే అతని వైఫల్యానికి కారణం​ కావొచ్చని గంభీర్‌ కాస్త అనుమానం వ్యక్తం చేశాడు.