టీం ఇండియా క్రికెటర్లలో చాలా మంది స్టార్ల కుటుంబాల వివరాలను మనం ఠక్కున చెప్పగలుగుతాము. ఉదాహరణకు ధోని అనగానే... ఆయన భార్య సాక్షి, కూతురు జివా అని చెప్పగలుగుతాము. అలానే రోహిత్ శర్మ అనగానే భార్య రితిక అని కూడా చెప్పగలము. 

కానీ కొంతమంది గురించి మాత్రం మనకు ఎక్కువగా తెలియదు. వారు వారి ప్రైవేట్ లైఫ్ ని అత్యంత గోప్యంగా ఉంచుకుంటుంటారు. బహుశా వారికదే ఇష్టమేమో! అలంటి కోవ లోకే వస్తాడు టీం ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే. 

అజింక్యా రహానే సహజంగా మృదుస్వభావి. పెద్దగా ఏ వివాదాల్లోనూ అంతలా తలదూర్చిన దాఖలాలు లేవు. ఇతర క్రికెటర్ల మాదిరి రూమర్లు కూడా ఎక్కువగా వినబడవు. అలా పర్సనల్ లైఫ్ ని అత్యంత గోప్యంగా ఉంచే రహానే తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ గురించి అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. 

Also read: చెత్త షాట్లు ఆడాం: ఇండియా బ్యాటింగ్ పై హనుమ విహారి

ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రహానే తన భార్య రాధిక, తండ్రి గా కొత్తగా చేపడుతున్న బాధ్యతల గురించి పలు అంశాలను చెప్పాడు. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టమని, తన విషయంలో అది రుజువయిందని రహానే అభిప్రాయపడ్డాడు. 

వరుస క్రికెట్‌ టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌, విదేశీ టూర్‌లతో ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉంటానని, దీంతో తన భార్య రాధికతో, కూతురుతో సరదాగా గడపడానికి సమయం దొరకదని అన్నాడు. 

అయితే తాను క్రికెట్ కి ఎక్కువ ప్రాధన్యత ఇస్తాను కాబట్టి తన పాషన్ ఏంటో తన భార్య రాధికకు బాగా తెలుసు కాబట్టి తనను తేలికగా అర్థం చేసుకుంటుందని.... అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టమని సంతోషం వ్యక్తం చేసాడు. 

తన భార్యకు లైమ్‌లైట్‌లోకి రావడం ఇష్టం ఉండదని, అందుకే అమె గురించి ఎవరికి ఎక్కువ తెలియదని రహానే అన్నాడు. అయితే ఆటలో తాను ఎంత బిజీగా ఉండి ఆలసిపోయినప్పటికీ...  వీలు చిక్కినప్పుడు మాత్రం తనతో బయటకెళ్తానని అన్నాడు. 

Also read:ఆసియా కప్: గంగూలీ ప్రకటనపై భగ్గుమన్న పాక్ బోర్డు చైర్మన్

బయటకు తీసుకెళ్లడం, షాపింగ్‌ చేయడం, డిన్నరం చేయడం వంటివాటిని ఇద్దరు సమయం చిక్కినప్పుడల్లా ఎంజాయ్ చేస్తుంటాం అని అన్నాడు. ఇక క్రికెట్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా వెంటనే ఇంట్లో వాలిపోతానని.... ఆ సమయంలో పాప విషయంలో రాధికకు ఫుల్‌ రెస్ట్‌ ఇస్తానని, ఆ సమయంలో పాపకు సంబంధించి అన్ని విషయాలు, పనులను తానే చూసుకుంటానని, బాధ్యతలు ఇలా తీసుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసాడు. 

గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు జరుగుతున్నప్పుడు తనకు పాప పుట్టిందని, ఆ సమయంలో పక్కన లేనని అనిపించినప్పటికీ.... జట్టు కోసం ఆడటం గొప్పవిషయం కదా అని అన్నాడు. 

టెస్టు ముగిసిన వెంటనే తాను పాపను చూడటానికి ఆసుపత్రికి వెళ్లానని అన్నాడు. పాపను తన రెండు చేతుల్లోకి తీసుకోవడం, లాలించిన క్షణాలు ఇంకా గుర్తే ఉన్నాయని, అవన్నీ ఫ్రెష్ గా మెదులుతున్నాయని ఉద్వేగానికి లోనయ్యాడు. 

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక తన భార్యకు తగిన సమయం కేటాయించడంతోపాటు, పాపకు మంచి విద్యను అందించాలనుకుంటున్నానని అన్నాడు. ఇక తన అభిరుచుల గురించి మాట్లాడుతూ... సంగీతం అంటే ఇష్టమని అన్నాడు. 

తాను మంచి భోజన ప్రియుడునని, ఖాళీ సమయాలల్లో తన భార్య దగ్గర ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నానని... ప్రస్తుతానికి కొన్ని వంటకాలను మాత్రమే మంచిగా చేయగలనని అన్నాడు. 

ప్రపంచకప్‌ అనేది తన కల అని, ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో తాను సభ్యుడిగా ఉండాలనేది తన చిరకాల కోరిక అని అన్నాడు. ఇక తన భీమన ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ... ఆటలో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లే తనకు ప్రేరణ అని అన్నాడు. బయట విషయాల్లో మాత్రం తన తండ్రే తనకు ఆదర్శం అని అన్నాడు.