టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాక్‌డౌన్ సమయంలో తన నైపుణ్యాలను మరింత పెంచుకోవడంతో పాటు భార్య, కుటుంబంతో బాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకునేవాడు.

అయితే  తాజాగా మయాంక్ అగర్వాల్‌తో సరదాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్.. తన భార్య అనుష్క శర్మ పుట్టినరోజు సందర్భంగా  తానే స్వయంగా కేక్ తయారు చేసి కట్ చేయించినట్లు తెలిపాడు.

Also Read:హార్దిక్ నటాషాల క్యూట్ ఫోటో, గంటలో 70 లక్షల లైకులు

తన జీవితంలో కేక్ తయారు చేయడం అదే మొదటిసారని.. అయితే ఆ ప్రయత్నం ఫలించి కేక్ బాగానే వచ్చినట్లు విరాట్ చెప్పాడు. అనుష్క శర్మ సైతం కేక్ బాగుందని.. అది తనకు చాలా ప్రత్యేకమైనదని కాంప్లిమెంట్స్ ఇచ్చినట్లు మయాంక్‌తో చెప్పాడు.

అలాగే టీమిండియా క్రికెటర్లలో బెస్ట్ ప్రోటీన్ షేక్‌లను తయారు చేసే వారి గురించి అడగ్గా.. అందుకు విరాట్ స్పందించాడు. మయాంక్ అగర్వాల్, నవదీప్ షైనీతో పాటు తన పేరు కూడా చెప్పాడు. ఆ వెంటనే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో తనకు తెలుసునని కోహ్లీ సరదాగా అన్నాడు.

Also Read:మీ ప్రేమ.. ఆదరణకు ధన్యవాదాలు: 1000వ పోస్ట్‌లో ఎమోషనల్ అయిన కోహ్లీ

మొదట మిమ్మల్ని, తర్వాత నవ‌దీప్ షైనీని, ఈ తర్వాత తనకు తాను రేటింగ్ ఇచ్చుకుంటానని చెప్పాడు. ఇక లాక్‌డౌన్ విషయానికి వస్తే రెగ్యులర్‌గా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో ఎక్కువ సేపు గడపినట్లు విరాట్ కోహ్లీ  తెలిపాడు.

మరోవైపు 2020లో ఐపీఎల్ సెప్టెంబర్ నుంచి ప్రారంభంకానుండటంతో ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును విజేతగా నిలపాలనుకుంటున్నట్లు విరాట్ తన మనసులోని మాటను చెప్పాడు. గడిచిన 12 ఐపీఎల్ సీజన్‌లలోనూ బెంగళూరు జట్టుకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే.