Asianet News TeluguAsianet News Telugu

t20worldcup 2021: ఆసీస్‌ను ఆదుకున్న స్మిత్, మ్యాక్స్‌వెల్... టీమిండియా ముందు...

t20worldcup 2021:  20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ మెరుపులు...

t20worldcup 2021: maxwell and steve smith innings helped australia scored better total
Author
India, First Published Oct 20, 2021, 5:17 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021   టోర్నీ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మంచి పర్ఫామెన్స్ ఇస్తే, రెండో వార్మప్ మ్యాచులో బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, ఆఖరి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి... ఆసీస్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు.

7 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన డేవిడ్ వార్నర్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా, ఆ తర్వాత మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు... 10 బంతుల్లో 8 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

Must Read: టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

28 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, తనస్టైల్‌లో బ్యాటింగ్ కొనసాగించిన స్టీవ్ స్మిత్, 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు..

48 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన స్టోయినిస్ నాటౌట్‌గా నిలిచాడు... 

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహార్, జడేజా తలా ఓ వికెట్ తీశారు. సబ్‌స్ట్రిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం...

భారీ అంచనాలతో తుదిజట్టులోకి చేర్చిన శార్దూల్ ఠాకూర్, 3 ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయాడు. అదీకాకుండా 30 పరుగులు సమర్పించాడు. వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఈ ఇద్దరి కంటే పార్ట్ టైం బౌలర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం..

గత మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌కి రాలేదు. దీంతో విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేయించి, ప్రయోగం చేసినట్టు కనిపించింది. టాస్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ రోహిత్ ఇదే విధంగా కామెంట్ చేశాడు. పాండ్యా బౌలింగ్ చేయలేకపోతే, తాను, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ కలిసి బౌలింగ్ చేస్తామని కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..

ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

Follow Us:
Download App:
  • android
  • ios