West Indies vs South Africa: వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా... డిఫెండింగ్ ఛాంపియన్‌కి వరుసగా రెండో ఓటమి...

టీ20 వరల్డ్‌కప్ 2021టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, వరుసగా రెండో ఓటమి ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని అందుకున్న విండీస్, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా, వెస్టిండీస్‌పై ఘన విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా, ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 

144 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా, వికెట్లు కోల్పోయి ఈజీగా విజయాన్ని అందుకుంది. 2 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ భువమా, తొలి ఓవర్‌లోనే రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాను హెండ్రిక్స్, దుస్సెన్ కలిసి ఆదుకున్నారు. రెండో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన హెండ్రిక్స్ అవుట్ అయ్యాడు.

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

ఆ తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న అయిడెన్ మార్క్‌రమ్, దుస్సేన్ కలిసి మూడో వికెట్‌కి పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లాంఛనాన్ని పూర్తిచేశారు. 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది సఫారీ జట్టు... దుస్సేన్ 51 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేయగా, అయిడెన్ మార్క్‌రమ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవంతో నెమ్మదిగా ఆడుతూ భాగస్వామ్యం నెలకొల్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు సిమన్స్, లూయిస్. 10.2 ఓవర్లలో తొలి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విండీస్ ఓపెనర్లు. చేతిలో 10 వికెట్లు ఉండడంతో వెస్టిండీస్ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది.

Read this: ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

అయితే 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి, అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది విండీస్. 35 బంతులాడిన ఓపెనర్ సిమ్మన్స్, ఒక్క బౌండరీ కూడా కొట్టకపోగా 16 పరుగులు మాత్రమే చేశాడు. పూరన్ 12, క్రిస్ గేల్ 12, కిరన్ పోలార్డ్ 26 పరుగులు చేయగా... ఆ తర్వాత వచ్చిన ఆండ్రే రస్సెల్ 5, హట్మయర్ 1 పరుగులకే పెవిలియన్ చేరాడు.

2 ఓవర్లలో 3 వికెట్లు తీసిన పెట్రోరియస్‌కి కాకుండా 4 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి, విండీస్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేసిన అన్రీచ్ నోకియాకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రావడం విశేషం. 

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్...