Asianet News TeluguAsianet News Telugu

ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

T20 worldcup 2021: ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్‌కి సపోర్ట్ చేయాల్సి వస్తోందనే ఉద్దేశంతో  వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్న క్వింటన్ డి కాక్..

West Indies vs South Africa: Quinton de Kock not playing because of his stand on BLM movement
Author
India, First Published Oct 26, 2021, 5:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్ కోసం క్రికెటర్లందరూ మ్యాచ్ ఆరంభానికి ముందు మోకాళ్ల మీద నిల్చుని, చేతుల పైకెత్తేతూ తమ మద్ధతు తెలపాలని సూచించింది ఐసీసీ. విండీస్ క్రికెటర్ల నుంచి భారత క్రికెటర్లు, మిగిలిన దేశాల క్రికెటర్లు కూడా ఈ మూమెంట్‌కి సపోర్ట్ చేస్తూ మ్యాచ్‌కి ముందు మోకాళ్ల మీద నించుని, చేతిని పైకెత్తెతూ... ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్‌కి సపోర్ట్ చేశారు.

టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు మోకాళ్ల మీద నించుని, ఈ మూమెంట్‌కి సపోర్ట్ చేస్తే... పాకిస్తానీలు గుండెల మీద చేతులు పెట్టుకుని తమ పద్ధతితో మద్ధతు తెలిపారు... అయితే సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింగన్ డి కాక్ మాత్రం ఈ మూమెంట్‌కి సపోర్ట్ చేయడం ఇష్టం లేక, సౌతాప్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మోకాళ్ల మీద కూర్చోలేదు.

అందరూ ఈ మూమెంట్‌కి సపోర్ట్ చేస్తూ బెండ్ అయినప్పుడు, డి కాక్ వారిని చూస్తూ నిల్చోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. డి కాక్‌తో సఫారీ జట్టులోని కొందరు తెల్ల జాతీయలు మోకాళ్ల మీద కూర్చోడానికి ఇష్టపడలేదు... తాజాగా‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్‌కి సపోర్ట్ చేయాల్సి వస్తోందనే ఉద్దేశంతో  వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడట క్వింటన్ డి కాక్..

దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్.. డి కాక్ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్‌కి సపోర్ట్ చేయడం ఇష్టం లేదని చెప్పాడని, అందుకే నేటి మ్యాచ్‌లో ఆడడం ఇష్టం లేక తప్పుకున్నాడని స్టేట్‌మెంట్ విడుదల చేసింది. 

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

సౌతాఫ్రికా కెప్టెన్ భువమా  ‘డి కాక్ వ్యక్తిగత కారణాలతో నేటి మ్యాచ్‌కి దూరంగా ఉంటున్నాడు’ అని తెలిపాడు.  ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, రేసిజం సంఘటనలతో అనేక ఇబ్బందులు పడుతోంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్, మార్క్ బ్రౌచర్లపైన కూడా నల్లజాతి క్రికెటర్లపై వర్ణ వివక్ష చూపించారంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి...

ఇప్పుడు డి కాక్ కూడా ఈ లిస్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.. ‘తెల్ల తోలుతో పుట్టినంత మాత్రాన తాము స్వర్ణం నుంచి దిగి వచ్చినట్టుగా ఎందుకు ఫీల్ అయిపోతారంటూ’ డి కాక్‌ను విమర్శిస్తూ, ట్వీట్ల దాడి చేస్తున్నారు నెటిజన్లు... భారత స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే ఇదే విషయంపై ట్వీట్ చేశాడు. ‘ఇదే కారణంగా డి కాక్ నేటి మ్యాచ్‌లో ఆడకపోతే మాత్రం, బహుళా మళ్లీ అతన్ని సఫారీ జెర్సీలో చూడమేమో..’ అంటూ కామెంట్ చేశాడు హర్షా భోగ్లే. 

అయితే ఓ వర్గం వాదన మరోలా ఉంది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ అనేది అమెరికా ప్రవేశపెట్టిన మూమెంట్. దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం అందరికీ లేదు. వర్ణ వివక్షపై పోరాడాలనే ఉద్దేశం తనకి ఉన్నప్పటికీ, అమెరికా అధిపత్య ధోరణిని అంగీకరించడం ఇష్టం లేకనే డి కాక్ అలా చేసి ఉంటాడని వాదిస్తున్నారు...

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

అల్కహాల్ కంపెనీ లోగో వేసి ఉన్న జెర్సీని వేసుకోవడం ఇష్టపడని హషీమ్ ఆమ్లాకి జట్టులో చోటు ఇచ్చారు కానీ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్ కోసం బెండ్ అవ్వడం ఇష్టం లేదని చెబితే జట్టులో నుంచి తీసేస్తారా? అంటూ వింత వాదన కూడా చేస్తున్నారు కొందరు సెక్యూరలిస్టులు... డి కాక్ ఇష్యూ చాలా దూరం వెళ్లేలానే కనిపిస్తోంది...

Follow Us:
Download App:
  • android
  • ios