ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...
పాకిస్తాన్ విజయాన్ని, చాలామంది భారతీయులు టపాకాయలు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు.మరి, దీపావళి రోజు టపాసులు కాలిస్తే తప్పేముంది... వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ వైరల్...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాకి ఊహించని షాక్ ఇచ్చింది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో 12 వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ, మొట్టమొదటి విజయాన్ని నమోదుచేసింది.
‘మోకా... మోకా’ అంటూ, ‘సున్నాని కనిపెట్టింది మీరేనంటూ’ పాక్‌ను తీవ్రంగా ట్రోల్ చేసినవారికి తమ ఆటతోనే సమాధానం చెప్పింది...
పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లున్న భారత జట్టు, ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం భారత అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన భారత అభిమానులు, తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అంతకుమించి భారత్‌లోనే కొంతమంది పాకిస్తాన్ విజయాన్ని టపాసులు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం, ఆ బాధను కోపంగా మార్చింది.
టీమిండియాపై పాకిస్తాన్ గెలిచిన తర్వాత భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ముస్లింలు టపాసులు పేలుస్తూ, పాక్ జెండాలతో సెలబ్రేట్ చేసుకోవడం... అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
ఈ సంఘటన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు.. ‘వాతావరణ కాలుష్యం పేరుతో భారత్‌లో టపాసులను నిషేధించారు. కానీ గత రాత్రి పాకిస్తాన్ విజయాన్ని, చాలామంది భారతీయులు టపాకాయలు పేల్చి సెలబ్రేట్ చేసుకున్నారు.
అచ్చా... వాళ్లు క్రికెట్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు... అలా అయితే, దీపావళి రోజు టపాసులు కాలిస్తే తప్పేముంది... ఎందుకు ఇంతలా పక్షపాతం చూపిస్తున్నారు... అందరికీ అప్పుడే వాతావరణ కాలుష్యం, తెలివి అన్నీ గుర్తుకు వస్తాయా...’ అంటూ హేతువాదులకు గట్టి కౌంటర్ ఇచ్చారు వీరేంద్ర సెహ్వాగ్...
పాకిస్తాన్ మన సైనికుల ప్రాణాలు తీస్తుంటే, వాళ్లతో క్రికెట్ మ్యాచులు ఆడతారా? అని నిలదీసిన చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇలా టపాకాయలు కాల్చి, సెలబ్రేట్ చేసుకున్నవారిలో ఉండడం విశేషం.
తీవ్రవాదులు బయట ఎక్కడి నుంచో రారో, మనలోనే ఉన్నారనే విషయానికి పర్ఫెక్ట్ ఉదాహరణ గత రాత్రి జరిగిన సెలబ్రేషన్సే అంటున్నారు చాలామంది నెటిజన్లు..