Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup 2021: పాకిస్తాన్‌కి వరుసగా రెండో విక్టరీ... న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న...

t20 worldcup 2021: పోరాడి ఓడిన న్యూజిలాండ్... 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్...వరుసగా రెండో విజయంతో టాప్‌లోకి...

T20 worldcup 2021: Pakistan beats New Zealand, consecutive second win in t20 worldcup
Author
India, First Published Oct 26, 2021, 10:56 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు పాక్ టూర్‌కి వెళ్లి, భద్రతా కారణాలతో మ్యాచ్ ఆరంభానికి ముందు టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్న న్యూజిలాండ్‌పై చెప్పి మరీ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్... దీంతో వన్‌సైడెడ్‌గా అవుతాయని అనుకున్న గ్రూప్ 2 మ్యాచులు కూడా ఉత్కంఠభరితంగా మారాయి...

135 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్‌కి శుభారంభం దక్కలేదు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ ఫకార్ జమాన్ 17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి ఇష్ సోధీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన న్యూజిలాండ్‌‌కి అనుకూలంగా వచ్చింది. 

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

6 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన మహ్మద్ హఫీజ్, సాంట్నర్ బౌలింగ్‌లో డివాన్ కాన్వే పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 34 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఇష్ సోధీ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన ఇమాద్ వసీం, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్... 24 బంతుల్లో 37 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ రేగింది. అయితే టిమ్ సౌథీ వేసిన 17వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు అసిఫ్ ఆలీ...

Read this: ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం..

ఆ తర్వాత మిచెల్ స్నాంటర్ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టిన షోయబ్ మాలిక్, మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అసిఫ్ ఆలీ, మ్యాచ్‌ను ముగించేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది... షాహీన్ ఆఫ్రిదీ వేసిన మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాలేదు. మెయిడిన్ ఓవర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్, ఓపెనర్లు మంచి ఆరంభమే అందించే ప్రయత్నం చేశారు.

20 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్‌ను హరీస్ రౌఫ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు... మరో ఓపెనర్ డారిల్ మిచెల్ 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి ఇమాద్ వసీం బౌలింగ్‌లో ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన జేమ్స్ నీశమ్, హఫీజ్ వేసిన మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

24 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన డివాన్ కాన్వేని రౌఫ్ అవుట్ చేయగా 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియంసన్ రనౌట్ అయ్యాడు... గ్లెన్ ఫిలిప్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి అవుట్ కగా టిమ్ సిఫర్ట్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. 6 పరుగులు చేసిన మిచెల్ సాంట్నర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు...

పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ ఓ వికెట్ తీయగా, హరీస్ రౌఫ్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇమాద్ వసీం, హఫీజ్ చెరో వికెట్ తీశారు... నాలుగు వికెట్లు తీసిన హారిస్ రౌఫ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

 

Follow Us:
Download App:
  • android
  • ios