టీ20 వరల్డ్‌కప్ 2021 : 20 ఓవర్లలో 122 పరుగులకి ఆలౌట్ అయిన ఓమన్... కీలక పోరులో రాణించిన ఓపెనర్ అకిబ్ ఇలియాస్, కెప్టెన్ జీషన్ మక్సూద్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఓమన్ జట్టు బ్యాట్స్‌మెన్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఓమన్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది...

మొదటి రెండో బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు జితిందర్ సింగ్. 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఓమన్, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కశ్యప్ ప్రజాపతి 3, సందీప్ గౌడ్ 5, నశీం ఖుషీ 2, సూరజ్ కుమార్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

ఓపెనర్ అకిబ్ ఇలియాస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు, మహ్మద్ నదీం 21 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు, కెప్టెన్ జీషన్ మక్సూద్ 30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయడంతో ఓమన్ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది...

గ్రూప్ బీలో 3 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించగా... స్కాట్లాండ్‌ ఇప్పటికే 2 విజయాలతో టాప్ 2లో ఉంది. అయితే స్కాట్లాండ్‌ కంటే రెండింట్లో ఓ విజయం అందుకున్న ఓమన్‌కి మెరుగైన రన్‌రేట్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిస్తే వారికి అవకాశాలు ఉండొచ్చు...

మూడు గ్రూప్ మ్యాచుల్లో మూడు పరాజయాలు అందుకున్న పుపువా న్యూ గినియా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్కమించింది. గ్రూప్ ఏలో రెండు మ్యాచుల్లో రెండు పరాజయాలు అందుకున్న నెదర్లాండ్స్ కూడా టోర్నీ నుంచి నిష్కమించింది. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా మిగిలిన ప్లేస్ కోసం ఐర్లాండ్, నమీబియా తలబడుతున్నాయి...

రెండు గ్రూప్‌ల నుంచి టేబుల్ టాపర్‌లుగా నిలిచిన రెండు జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. సూపర్ 12 రౌండ్‌లో రెండు గ్రూప్‌ల నుంచి టాప్ 2లో నిలిచిన నాలుగు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు, టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్‌ చేరతాయి...

ఇవీ చదవండి: T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...