T20 World Cup 2024 : వెస్టిండీస్ గెలిచింది.. పపువా న్యూ గినియా అంద‌రి మ‌న‌సులు గెలిచింది.. అద్భుత పోరాటం ఇది..

T20 World Cup 2024 WI vs PNG : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ కు చెమ‌ట‌లు ప‌ట్టించింది ప‌పువా న్యూ గినియా. అద్భుత‌మైన బౌలింగ్ తో స్టార్ ప్లేయ‌ర్ల‌తో కూడిన విండీస్ జ‌ట్టును తెగ ఇబ్బంది పెట్టింది.
 

T20 World Cup 2024: Papua New Guinea's amazing fightback, First win for title favourites West Indies RMA

T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో టైటిల్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతున్న జ‌ట్ల‌లో అతిథ్య దేశం వెస్టిండీస్ కూడా ఉంది. కానీ, టీ20 ప్ర‌పంచ క‌ప్ లో త‌న తొలి మ్యాచ్ లో విజ‌యం కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌చ్చింది. రెండు సార్లు ఈ టోర్నీలో ఛాంపియ‌న్ గా నిలిచిన వెస్టిండీస్ కు చెమ‌ట‌లు ప‌ట్టించింది ప‌సికూన‌ పపువా న్యూ గినియా.  అద్భుత‌మైన ఆట‌తీరును అంద‌రినీ ఆక‌ట్టుకుంది. రోస్టన్ చేజ్ చివ‌రివ‌ర‌కు క్రీజులో ఉండి మంచి ఇన్నింగ్స్ ఆడ‌టంతో విండీస్ కు విజ‌యం ల‌భించింది.

దీంతో ఈ ప్ర‌పంచ క‌ప్ లో తొలి విజ‌యం అమెరికా అందుకోగా, రెండో విజ‌యం వెస్టిండీస్ సాధించింది. ఈ రెండు జ‌ట్లు కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కు అతిథ్యం ఇస్తున్నవి కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పపువా న్యూ గినియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ అస‌ద్ వాలా 21 ప‌రుగులు, సెసే బావు 50 ప‌రుగులు, కిప్లిన్ డోరిగా 27 ప‌రుగుల ఇన్నింగ్స్ తో పపువా న్యూ గినియా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 136 ప‌రుగులు చేసింది.

India vs Ireland: టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భార‌త్ రికార్డులు ఇవే

స్టార్ ప్లేయ‌ర్ల‌తో కూడిన వెస్టిండీస్ కు ఇది ఈజీ టార్గెట్ కానీ, పపువా న్యూ గినియా 137 ప‌రుగుల టార్గెట్ కోసం నిలుపుకోవ‌డం కోసం అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ విన్నింగ్ మ్యాచ్ అనుకుంటూ సూప‌ర్ బౌలింగ్ తో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్ ను తీసుకెళ్లింది. 137 పరుగులు ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది. అస్సాద్ వాలా బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న క్రమంలో రోస్టన్ చేజ్ చివరి వరకు నిలబడి వెస్టిండీస్ కు విజయం అందించాడు.

వెస్టిండీస్ ప్లేయర్లలో నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, రూథర్ ఫోర్డ్ 2 పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. పపువా న్యూగినియా ఈ మ్యాచ్ లో అద్భుతమైన పోరాటం చేసింది. సూపర్ బౌలింగ్ తో చిన్న టార్గెట్ ను సైతం నిలుపుకోవడానికి పోరాడి అందరి మనసులు గెలుచుకుంది. ఛాంపియన్ టీమ్ కు చెమటలు పట్టించింది. కెప్టెన్ అసద్ వాలా 2 వికెట్లు తీసుకోగా, అలీ నావో, చాడ్ సోపర్, జాన్ కరికోలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 

 

"భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంచనాలు-హైప్ భయాన్ని క‌లిగిస్తున్నాయి.."

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios