సెమీస్ బెర్త్ కన్ఫర్మ్.. బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన భార‌త్

T20 World Cup 2024: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 సూప‌ర-8 లో టీమిండియా రెండో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనింగ్ జోడీ రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీలు జ‌ట్టుకు శుభారంభం అందించ‌గా, చివ‌ర‌లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 

T20 World Cup 2024: india won by 50 runs in super-8 vs Bangladesh IND vs BAN RMA

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా 47వ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. ఈ ప్ర‌పంచ క‌ప్ సూప‌ర్-8 ద‌శ‌లో రెండో విజ‌యాన్ని అందుకుంది. దీంతో టీమిండియా సెమీ ఫైన‌ల్ కు మ‌రింత చేరువైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవ‌డంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. విరాట్ కోహ్లీ-రోహిత్ శ‌ర్మ జోడీ భార‌త జ‌ట్టుకు అద్భుత‌మైన ఆరంభం అందించింది.  మొద‌టి బాట్ నుంచే బిగ్ షాట్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశారు ఈ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు. ఈ జోడీ నాలుగో ఓవ‌ర్ ముగియ‌క‌ముందే తొలి వికెట్ కు 39 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. 

ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ బిగ్ షాట్ ఆడ‌బోయి  23 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ 23 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు. మ‌రో ఎండ్ లో కోహ్లీ సిక్స‌ర్ల‌తో అద‌ర‌గొట్టాడు. ఆడిన చిన్న ఇన్నింగ్స్ అయినా అద్భుత‌మైన మూడు సిక్స‌ర్లు బాదాడు. కోహ్లీ త‌న 37 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 1 ఫోరు, 3 సిక్స‌ర్లు బాదాడు. అలాగే, రిష‌బ్ పంత్ కూడా 36 ప‌రుగుల‌తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర‌లో శివ‌మ్ దుబే 34, హార్దిక్ పాండ్యా 50 ప‌రుగుల ఇన్నింగ్స్ తో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తంజిబ్ హాస‌న్ సాకిబ్, రిష‌ద్ లో చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. షాకిబ్ ఆల్ హాస‌న్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇది క‌రెక్టు కాదు.. చాలా అన్యాయం.. గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

197 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 20 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. బంగ్లాదేశ్ బ్యాటర్ల‌లో  కెప్టెన్ షాంటో 40 ప‌రుగులు, తంజిద్ హాస‌న్ 29, రిష‌ద్ 24 ప‌రుగులు చేశారు. మిగతా ప్లేయ‌ర్లు క్రీజులో ఎక్కువ‌సేపు నిల‌బ‌డ‌లేక పోయారు. భార‌త అద్భుత‌మైన బౌలింగ్ తో ప‌రుగులు చేయ‌డానికి బంగ్లా ప్లేయ‌ర్లు ఇబ్బంది ప‌డ్డారు. దీంతో టీమిండియా చేతిలో బంగ్లాదేశ్ 50 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ (50* ప‌రుగులు) తో పాటు ఒక వికెట్ తీసిన భార‌త ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ గెలుపుతో టీమిండియా సెమీ ఫైన‌ల్ అవ‌కాశాలు మ‌రింత మెరుగుప‌డ్డాయి. ఒక‌వేళ ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే టీమిండియా నేరుగా సెమీ ఫైన‌ల్ కు చేరుకుంటుంది.

 

 

 

ఉన్నంత సేపు ఇర‌గ‌దీశాడు.. ప్ర‌పంచ క‌ప్ లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios