ఉన్నంత సేపు ఇరగదీశాడు.. ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
T20 World Cup 2024-Virat Kohli : భారత్ తన రెండో సూపర్-8 మ్యాచ్ లో స్టార్ ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు జట్టుకు మంచి శుభారంభం అందించారు. క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్ తో ఇరగదీసిన కింగ్ కోహ్లీ ప్రపంచ కప్ లో మరో ఘనత సాధించాడు.
T20 World Cup 2024-Virat Kohli : టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా 47వ మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ జోడీ భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించింది. మొదటి బాట్ నుంచే బిగ్ షాట్స్ ఆడే ప్రయత్నం చేశారు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు. ఈ జోడీ నాలుగో ఓవర్ ముగియకముందే తొలి వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యం అందించింది.
రోహిత్ శర్మ బిగ్ షాట్ ఆడబోయి 23 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 23 పరుగుల తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మరో ఎండ్ లో కోహ్లీ సిక్సర్లతో అదరగొట్టాడు. ఆడిన చిన్న ఇన్నింగ్స్ అయినా అద్భుతమైన మూడు సిక్సర్లు బాదాడు. కోహ్లీ తన 37 పరుగుల ఇన్నింగ్స్ లో 1 ఫోరు, 3 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీ వరల్డ్ కప్ లో మరో రికార్డు సాధించాడు. టీ20, వన్డే ప్రపంచ కప్ లో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 3000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐసీసీ టీ20-వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్
1. విరాట్ కోహ్లీ - 3000+ పరుగులు
2. రోహిత్ శర్మ - 2637 పరుగులు
3. డేవిడ్ వార్నర్ - 2502
4. సచిన్ టెండూల్కర్ - 2278
5. కుమార సంగక్కర - 2193
దూకుడుగా మొదలుపెట్టారు కానీ.. మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ