Asianet News TeluguAsianet News Telugu

ఇది క‌రెక్టు కాదు.. చాలా అన్యాయం.. గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

Gautam Gambhir's comments on ICC rule : "క్రికెట్ స్ఫూర్తి ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సరైన ఆట స్ఫూర్తితో ఆడతారు. కాబ‌ట్టి నియ‌మాలు క్రికెట్ కు, ఆట‌గాళ్ల‌కు అన్యాయం అనిపించేలా ఉండ‌కూడ‌ద‌ని ఐసీసీ రూల్" పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ అన్నాడు. 
 

This is not correct, Very unfair.. Gautam Gambhir's shocking comments on ICC rule, ICC Mens T20 World Cup 2024 RMA
Author
First Published Jun 22, 2024, 6:14 PM IST | Last Updated Jun 22, 2024, 6:19 PM IST

T20 World Cup 2024: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐసీసీ నిబంధ‌న‌ల‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. వన్డే ఇంటర్నేషనల్స్‌లో రెండు కొత్త బాల్ నిబంధనలు చాలా అన్యాయమ‌నీ, ఇది ఇది ఆట డైనమిక్‌లను మార్చిందని ఆరోపించారు. ఇది క్రికెట్ ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని చెప్పాడు. స్పిన్నర్లకు ఇది హానికరమనీ, ఈ నిబంధనను తొలగించాలని గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను సూచ‌న‌లు చేశాడు. కాగా, బంతి తన మెరుపును నిలుపుకోవడం, రివర్స్ స్వింగ్‌ను తగ్గించడంలో సహాయపడటానికి అక్టోబర్ 2011లో ఈ నియమాన్ని ఐసీసీ ఆమోదించింది.

ఈ నియమం మ్యాచ్లను సమర్థవంతంగా ప్రభావితం చేయడానికి ఫింగర్ స్పిన్నర్లకు తక్కువ అవకాశాలకు దారితీసిందనే వాదనలు ఉన్నాయి. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో వ‌న్డే క్రికెట్ లో రెండు కొత్త బంతుల నిబంధ‌న‌ల గురించి గౌత‌మ్ గంభీర్ మాట్లాడుతూ.. ఈ నియమం ఫింగర్-స్పిన్నర్‌లకు అన్యాయంగా ప్రతికూలంగా ఉంద‌న్నాడు. వైట్-బాల్ క్రికెట్‌లో వారి భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని స్ప‌ష్టం చేశాడు. "క్రికెట్ స్ఫూర్తి ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సరైన ఆట స్ఫూర్తితో ఆడాల‌నుకుంటారు. నియమాలు ఉండ‌టం త‌ప్పుకాదు కానీ, వ‌న్డే క్రికెట్ లో రెండు కొత్త బంతులు ఉండ‌టం అన్యాయ‌మే.. ఈ రెండు కొత్త బంతుల నిబంధ‌న‌ల‌ను తొల‌గించండి" అని గంభీర్ పేర్కొన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో భార‌త్ సెమీస్ చేరాలంటే ఇదీ జ‌ర‌గాలి.. !

"ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్‌లో ఫింగర్ స్పిన్నర్‌కి ఇది చాలా అన్యాయం. ఫింగర్ స్పిన్నర్‌కు తగినంత వైట్-బాల్ క్రికెట్ ఆడకపోవడం చాలా అన్యాయం, ఎందుకంటే వారికి సానుకూల అంశాల పెద్ద‌గా లేవు. ఇది సరైనది కాదు" అని  కూడా గౌత‌మ్ గంభీర్ పేర్కొన్నాడు. బౌలింగ్ శైలితో సంబంధం లేకుండా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆటగాళ్లందరికీ సమాన అవకాశం కల్పించేలా నిబంధనను సవరించాలని ఐసీసీని కోరాడు. "ఐసీసీ ప‌ని ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వారి ప్రతిభను ప్రదర్శించడానికి సమాన అవకాశం లభించేలా చూసుకోవడం. కానీ మీరు ఒక నిర్దిష్ట విభాగం ఆటగాళ్ల నుండి ఆ ప్రతిభను తీసుకున్నప్పుడు, అది చాలా అన్యాయం. నేడు, మీరు ఏ వేలు కూడా చూడలేరు. స్పిన్నర్‌ను ఎందుకు నిందించాల్సిన అవసరం లేదు.. రెండు కొత్త బంతుల నిబంధ‌న‌లు వ‌దిలించుకోవాలి" అని గౌత‌మ్ గంభీర్ అన్నాడు.

రోహిత్ శర్మ కోసం మ్యాచ్ మధ్యలోనే బంగ్లాదేశ్ ప్లేయర్ తో ధోని బిగ్ ఫైట్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios