BAN vs SL, T20 World Cup 2024: డల్లాస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 15వ మ్యాచ్ చివరి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌ను రేపింది. అయితే, చివ‌ర‌కు శ్రీలంకపై బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ అందుకుంది. 

BAN vs SL, T20 World Cup 2024: డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో శనివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్-డీ మ్యాచ్ లో బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన థ్రిల్లింగ్ గేమ్ విజ‌యంతో మూడు ప్రపంచకప్ మ్యాచ్ ల్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. బౌన్సీ పిచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో. పటిష్టమైన బౌలింగ్ పిచ్ పై బంగ్లా సీమర్లు స్టంప్ టు స్టంప్ లైన్లతో బౌలింగ్ చేస్తుంటే శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిస్సాంకా బంతిని కచ్చితత్వంతో ఎదుర్కొని మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు.

పవర్ ప్లేలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన టాప్ ఆర్డర్ భాగస్వాములైన కుశాల్ మెండిస్, కమిందు మెండిస్ లను ఔట్ చేసి దెబ్బ‌కొట్టారు. నిస్సాంక (47) ప‌రుగుల వ‌ద్ద ముస్తాఫిజుర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. యువ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ తన నాలుగు ఓవర్ల స్పెల్ లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక మిడిలార్డర్ ను దెబ్బ‌కొట్టాడు. ఫలితంగా శ్రీలంక 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగులు చేసింది.

పాకిస్థాన్‌తో మ్యాచ్ కు రోహిత్ శ‌ర్మ దూరం కానున్నాడా? టెన్షన్ పెంచిన బుమ్రా భార్య పోస్ట్

125 ప‌రుగ‌ల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్లు తన్జిద్ హసన్, సౌమ్య సర్కార్ ఇద్ద‌రూ త్వ‌ర‌గానే పెవిలియ‌న్ కు చేరారు. కెప్టెన్ శాంటో 13 బంతుల్లో 7 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లా క‌ష్టాలు మ‌రింత పెరిగాయి. ఈ స‌మ‌యంలో లిటన్ దాస్, తౌహిద్ హృదోయ్ తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యం అందించారు. లిట్ట‌న్ దాస్ 36, హృదోయ్ 40 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడారు. సీమర్లు నువాన్ తుషారా 18వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ శ్రీలంక నుంచి అప్ప‌టికే మ్యాచ్ చేజారిపోయింది. లోయ‌ర్ ఆర్డ‌ర్ ప్లేయ‌ర్లు బంగ్లాకు మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని అందించారు. కాగా, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక గ్రూప్ లో అట్టడుగున ఉంది.

Scroll to load tweet…

ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. కేన్ మామ‌కు బిగ్ షాక్.. !