ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. కేన్ మామకు బిగ్ షాక్.. !
New Zealand vs Afghanistan : టీ20 ప్రపంచ కప్ 2024 లో న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుతమైన ప్రదర్శనతో కేన్ విలియమ్సన్ టీమ్ కు షాకిచ్చింది. 75 పరుగులకే కీవీస్ జట్టు కుప్పకూలింది.
New Zealand vs Afghanistan : టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా 14వ మ్యాచ్ లో న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి. మొదటి నుంచి ఆందోళనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు చివరకు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాయాజాలంలో పడింది. కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టి విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్ 84 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని గ్రూప్ సీ లో టాప్ స్థానంలోకి చేరుకుంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను ఈ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. రహ్మానుల్లా గుర్బాజ్ 56 బంతుల్లో 80 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఇబ్రహీం జద్రాన్ 44 పరుగులు, అజ్మతుల్లా 22 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 159 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్. కీవీస్ బౌలర్లలలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీసుకున్నారు.
T20 WORLD CUP 2024 : అదే జరిగితే సూపర్-8 చేరకుండానే పాకిస్తాన్ ఇంటికే..
160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఫజల్హాక్ ఫారూఖీ బౌలింగ్ లో కీవీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. ఇక్కడి నుంచి న్యూజిలాండ్ వికెట్ల పతనం కొనసాగింది. బ్యాటింగ్ కు వచ్చిన ఒక్క ప్లేయర్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేక పోయారు. గ్లెన్ ఫిలిప్స్ 18, మాట్ హెన్రీ 12 పరుగులు మినహా మిగతా ప్లేయర్లు అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. దీంతో 15.2 ఓవర్లలోనే 75 పరుగుల వద్ద కీవీస్ జట్టు ఆలౌట్ అయింది.
ఆప్ఘనిస్తాన్ బౌలర్లు మరోసారి సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు. కెప్టెన్ రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో కీవీస్ జట్టుకు షాకిచ్చాడు. రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, ఫజల్హక్ ఫారూఖీ 3.2 ఓవర్ల బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఆప్ఘనిస్తాన్ గ్రూప్ సీ లో టాప్ లోకి చేరుకుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది.
ఇది మంచి నాయకుడి లక్షణం కాదు.. బాబార్ ఆజం ఇలా చేస్తున్నావేంటి.. !