T20 World Cup 2024 : పాకిస్తాన్ కు షాకిచ్చిన అమెరికా.. మరో సూపర్ ఓవర్.. ఏమన్న మ్యాచా ఇది.. !
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 లో అమెరికా అద్భుత ప్రదర్శన చేస్తోంది. తమ రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ కు చెమటలు పట్టించి మ్యాచ్ ను మరో సూపర్ ఓవర్ కు తీసుకెళ్లింది యూఎస్ఏ.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో మరో మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది అమెరికా. తమకంటే ఎంతో బలమైన పాకిస్తాన్ జట్టుకు చెమటలు పట్టించింది. అద్భుతమైన పోరాట పటిమతో మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించి అందరి మనసులు గెలుచుకుంది అమెరికా.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజం 44 పరుగులు, షాదాబ్ ఖాన్ 40 పరుగులతో రాణించారు. 159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా ఆరంభం నుంచి బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన చేసింది. చివరి మిడిల్ లో పాక్ బౌలర్లు రాణించడంతో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడింది. దీంతో చివరి ఓవర్ లో 15 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి బంతికి 1 పరుగు వచ్చింది. రెండో బంతికి క్యాచ్ మిస్ చేయడంతో మరో పరుగు వచ్చింది. మూడో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది. 4వ బంతిని ఆరోన్ జోన్స్ సిక్సుగా మలచడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 5 బాల్ కు ఒక పరుగు వచ్చింది. చివరి బంతికి సిక్సు కొడితే గెలుస్తుంది. ఫోర్ కొడితే మ్యాచ్ టై అవుతుంది.
అదే జరిగింది చివరి బంతిని హరీస్ రవూఫ్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ నితీష్ కుమార్ ఫోర్ కొట్టాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈ ప్రపంచ కప్ లో ఇది రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ కావడం విశేషం.
భారత్ VS పాకిస్తాన్ మ్యాచ్ కు ముందే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజం