Asianet News TeluguAsianet News Telugu

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో సంచ‌ల‌నం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ కు.. ఆస్ట్రేలియా ఇంటికేనా..

AUS vs AFG: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా సెమీస్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయి.
 

T20 World Cup 2024: Afghanistan's win... Is Australia out of the semi-final race? This is the situation of Group-1 Super-8 teams RMA
Author
First Published Jun 23, 2024, 3:20 PM IST

AUS vs AFG: టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 లో సంచ‌ల‌నం న‌మోదైంది. ఏవ‌రూ ఊహించ‌ని విధంగా ఈజీ టార్గెట్ ముందు ఆస్ట్రేలియా బోల్తా ప‌డింది. ఆఫ్ఘ‌నిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్ త‌న సెమీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుంది. ఇదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా డూ ఆర్ డై మ్యాచ్ తో త‌న సెమీస్ అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టంగా మార్చుకుంది. సూప‌ర్-8 మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా అద్భుతంగా ప్రారంభించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ త‌గిలింది. ఈ ఓటమితో గోల్డెన్ ఛాన్స్ కూడా కోల్పోయింది.

మొదటి సూపర్-8 మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా పునరాగమనం చేసింది. ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించడంతో టీ20 ప్రపంచ కప్ 2024 చ‌రిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు ఆస్ట్రేలియాకు గొప్ప అవకాశం లభించినా అది కుదరలేదు. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా అద్భుత బౌలింగ్, ప్యాట్ క‌మ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీయ‌డంతో ఆఫ్ఘన్ జట్టు 148 పరుగులు మాత్ర‌మే చేసింది. స్టార్ ప్లేయ‌ర్ల‌తో కూడిన ఆస్ట్రేలియాకు ఇది పెద్ద టార్గెట్ కాద‌నే చెప్పాలి. కానీ, ఆఫ్ఘ‌న్ బౌల‌ర్లు అద‌ర‌గొట్ట‌డంతో ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది.

ఉన్నంత సేపు ఇర‌గ‌దీశాడు.. ప్ర‌పంచ క‌ప్ లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

తొలి ఓవర్‌లోనే ట్రావిస్‌ హెడ్‌ రూపంలో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం ఒక ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించాడు. కానీ, అత‌నికి మ‌రో ప్లేయ‌ర్ నుంచి స‌హ‌కారం ల‌భించ‌లేదు. మ్యాక్స్ వెల్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఆఫ్ఘ‌న్ బౌల‌ర్లు ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశం ఇవ్వ‌లేదు. దీంతో ఆసీస్ జ‌ట్టు 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

సెమీస్ కు చేరడం అంత సులువు కాదు.. 

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సెమీ-ఫైనల్‌కు  చేరుకునేందుకు ఆస్ట్రేలియాకు గొప్ప అవకాశం లభించింది, కానీ ఆ గోల్డెన్ ఛాన్స్‌ను కోల్పోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అన్నింటిలో మొదటిది త‌న‌ చివరి సూపర్-8 మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలి, అప్పుడే ఆసీస్ టాప్-4కి చేరుకోవడం సాధ్యమవుతుంది. జూన్ 24న భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టును ఇప్పటివరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదు.

భారత్ చేతిలో ఓడితే ఇంటికేనా?

భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే కంగారూ జట్టు ఎలిమినేట్ అవుతుందా? నిజానికి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ సెమీఫైనల్‌కు వెళ్లడం దాదాపు ఖాయంగా మారింది. ఒకవేళ భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఓడించినట్లయితే ఆస్ట్రేలియా ఇంటిదారి ప‌డుతుంది. ఎందుకంటే ఆఫ్ఘన్ జట్టుకు 4 పాయింట్లు వ‌స్తాయి. దీంతో భార‌త్ తో క‌లిసి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఒక‌వేళ భార‌త్ తో జ‌రిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే ఆ జ‌ట్టుకు రెండు పాయింట్లు వ‌స్తాయి. ఇదే స‌మ‌యంలో ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే రన్ రేట్ కీల‌కం కానుంది. ఎందుకంటే ఈ రెండు జ‌ట్ల‌కు  4 పాయింట్లు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉంటాయి, అయితే రన్ రేట్ మెరుగ్గా ఉన్న జ‌ట్లు నేరుగా సెమీస్ కు చేరుకుంటాయి.

సెమీస్ బెర్త్ కన్ఫర్మ్.. బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన భార‌త్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios