నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసిన స్కాట్లాండ్... టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన షకీబుల్ హసన్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ క్వాలిఫైయర్స్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు దుమ్ముదులిపారు. అయితే పసికూన స్కాట్లాండ్ కూడా త్వరగానే కోలుకుని, బంగ్లాదేశ్ ముందు మంచి టార్గెట్ పెట్టగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది...

మెహెదీ హసన్, షకీబుల్ హసన్ ధాటికి 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్.. ఈదశలో మార్క్ వ్యాట్, క్రిస్ గ్రేవ్స్ కలిసి ఏడో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కాట్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు.

28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన క్రిస్ గ్రేవ్స్‌ని ముస్తాఫిజుర్ అవుట్ చేయగా 17 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన మార్క్ వ్యాట్, తస్కిన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రెండు వికెట్లు తీసిన షకీబుల్ హసన్, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

టీ20ల్లో 108 వికెట్లు తీసిన షకీబుల్ హసన్, శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 107 వికెట్ల రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో కలిపి 600 వికెట్లు పూర్తిచేసుకున్న షకీబుల్ హసన్, బంగ్లా తరుపున ఏ ఫార్మాట్‌లో అయినా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు..

must read: అతనిలో మాహీ భాయ్ కనిపిస్తున్నాడు, వచ్చే ఏడాది కలిసి ఆడతామో లేదో... సురేష్ రైనా కామెంట్స్...

వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...