టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తొలిరోజే సంచలనం... బంగ్లాదేశ్‌పై 6 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న స్కాట్లాండ్... పసికూన చేతుల్లో బంగ్లా పులులు చిత్తు...

T20 World cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైయర్ మ్యాచుల్లోనే సంచలనం నమోదైంది. పసి కూన స్కాట్లాండ్ జట్టు, బంగ్లాదేశ్ జట్టును వణికించి, 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు 53/6 వద్ద ఉన్న స్కాట్లాండ్ తేరుకుని 140 పరుగులు చేయగా... దాన్ని కాపాడుకుంటూ బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు..

141 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన బంగ్లాదేశ్‌కి రెండో ఓవర్ నుంచే ముచ్ఛెమటలు పట్టించారు స్కాట్లాండ్ బౌలర్లు. సౌమ్యా సర్కార్ 5, లిటన్ దాస్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 18 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది బంగ్లా. ఈ దశలో షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం కలిసి మూడో వికెట్‌కి 47 పరుగులు జోడించారు.

అయితే 28 బంతుల్లో 20 పరుగులు చేసిన షకీబుల్ హసన్‌ను క్రిస్ గ్రేవ్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 36 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన ముస్తాపికర్ రహీం కూడా క్రిస్ గ్రేవ్స్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా 23, అఫిఫ్ హుస్సేన్ 18 పరుగులు చేసి ఆకట్టుకున్నా... వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్...

విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు కావాల్సిన దశలో రెండు వికెట్లు తీసి, కేవలం 8 పరుగులే ఇచ్చాడు వీల్. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు కావాల్సిన దశలో మొదటి మూడు బంతుల్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో గెలవాలంటే ఆఖరి 3 బంతుల్లో 3 సిక్సర్లు కావాల్సిన పరిస్థితి.

అయితే నాలుగో బంతికి మెహెడి హసన్ సిక్సర్ బాదినా, ఆ తర్వాతి బంతికి ఫోర్ మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి 8 పరుగులు కావాల్సి ఉండగా 1 పరుగు మాత్రమే వచ్చింది. దీంతో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 2016 సీజన్‌లో హంగ్ కాంగ్‌ను ఓడించిన స్కాట్లాండ్‌కి ఇది రెండో విజయం కావడం విశేషం.

must read: టీమిండియాతో కలిసిన మెంటర్ ధోనీ... మాజీ కెప్టెన్‌కి భారత జట్టు ఘన స్వాగతం...

అతనిలో మాహీ భాయ్ కనిపిస్తున్నాడు, వచ్చే ఏడాది కలిసి ఆడతామో లేదో... సురేష్ రైనా కామెంట్స్...

వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...