Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ సంచలనం.. రుతురాజ్ గైక్వాడ్ కి బంపర్ ఆఫర్..!

రుతురాజ్‌ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక నౌషద్‌ షేక్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

Syed Mushtaq Ali T20 Trophy: IPL 2021 Orange Cap winner Ruturaj Gaikwad to lead Maharashtra
Author
hyderabad, First Published Oct 27, 2021, 9:26 AM IST

Chennai Super kings( csk) స్టార్ ఓపెనర్, యువ క్రికెటర్   Ruturaj Gaikwad( రుతురాజ్ గైక్వాడ్) కు అనూహ్యంగా బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్‌-2021 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న అతడికి మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ నేపథ్యంలో 24 ఏళ్ల రుతురాజ్‌ను మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. కాగా ఈ దేశవాళీ టీ20 లీగ్‌ నవంబరు 4 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగానే ఎలైట్‌ గ్రూపు-ఏలో ఉన్న మహారాష్ట్ర లీగ్‌ స్టేజ్‌లో లక్నోలో మ్యాచ్‌లు ఆడనుంది. తమిళనాడు జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రుతురాజ్‌ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక నౌషద్‌ షేక్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

Also Read: T20 worldcup 2021: పాకిస్తాన్‌కి వరుసగా రెండో విక్టరీ... న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న...

ఈ విషయాల గురించి మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రియాజ్‌ బాగ్బన్‌ మాట్లాడుతూ... ‘‘రాహుల్‌ త్రిపాఠి, సిద్దేశ్‌ వీర్‌, రాజ్‌వర్ధన్‌ స్థానాలను స్వప్నిల్‌ గుగాలే, పవన్‌ షా, జగదీశ్‌ జోపేతో భర్తీ చేశాం. వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన త్రిపాఠి గాయం నుంచి కోలుకోకపోవడంతో నౌషద్‌ షేక్‌ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడు’’ అని పేర్కొన్నారు. ఇక రుతురాజ్‌ విషయానికొస్తే... చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగో సారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవడంలో రుతురాజ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Also Read: T20 worldcup 2021: విజృంభించిన పాక్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన న్యూజిలాండ్...

ఐపీఎల్‌-2021 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ ఓపెనర్‌.. మొత్తంగా 635 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 101 నాటౌట్‌. ఇక అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios