Suryakumar Yadav: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు !
Suryakumar Yadav: భారత జట్టులో మిస్టర్ 360గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ 2023 సంవత్సరపు ఉత్తమ టీ20 క్రికెటర్‌గా ఐసీసీ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) ను గెలుచుకున్నాడు. వరుసగా రెండో ఏడాది ఐసీసీ ఉత్తమ టీ20 క్రికెటర్ గా అవార్డు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.
T20I Cricketer of the Year - Suryakumar Yadav: టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా రెండోసారి టీ20 ఉత్తమ క్రికెటర్ గా అవార్డును గెలుచుకున్నాడు. 2023లో మొత్తం 18 టీ20 మ్యాచ్ లలో 733 పరుగులు చేసిన భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఐసీసీ ఎంపిక చేసింది. వరుసగా రెండో ఏడాది సూర్య ఈ ఘనత సాధించాడు. సికిందర్ రజా, అల్పేష్ రామజని, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ లు ఐసీసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ఫైనల్ గా సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. గత రెండేళ్లుగా టీ20 క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు ఈ టైటిల్ దక్కింది.
2023లో టీ20 అత్యధిక పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
2023 టీ20 క్రికెట్ లో 17 ఇన్నింగ్స్ లలో 155కు పైగా స్ట్రైక్ రేట్ తో 733 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. 48.86 సగటుతో ఈ పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ తో పాటు యూఏఈ ఆటగాడు మహ్మద్ వసీం, ఉగాండా ఆటగాడు రోజర్ ముకాసా అత్యధిక టీ20 పరుగులు చేసిన ప్లేయర్లుగా ఉన్నారు. మహ్మద్ వసీన్ 23 మ్యాచ్ లలో 823 పరుగులు చేయగా, ముకాసా 31 మ్యాచ్ లలో 738 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 16 ఏండ్ల ప్రయాణం.. ప్రత్యేక పోస్టర్.. ! టైటిల్ విజేతలు వీరే.. !
2023లో సూర్య రెండు సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్
టీ20 క్రికెట్ లో సెంచరీ సాధించడంలో సూర్యకుమన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2023లో సూర్య రెండు సెంచరీలు సాధించాడు. మొదటి సెంచరీ జనవరిలో శ్రీలంకపై, రెండో సెంచరీ దక్షిణాఫ్రికాపై కొట్టాడు. ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా రెండు సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్, మ్యాక్స్ వెల్ లు 4-4 సెంచరీలతో సమంగా ఉన్నారు. టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఏకైక బ్యాటర్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టీ20 జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యావద్
2023 టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అప్పగించింది. రవి విష్ణోయ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవా, అర్ష్ దీప్ సింగ్ లు ఐసీసీ 2023 టీ20 టీమ్ లో చోటుదక్కించుకున్నారు.
ఐపీఎల్ 16 ఏండ్ల ప్రయాణం.. ప్రత్యేక పోస్టర్.. ! టైటిల్ విజేతలు వీరే.. !