ఐపీఎల్ 16 ఏండ్ల ప్రయాణం.. ప్రత్యేక పోస్టర్.. ! టైటిల్ విజేతలు వీరే.. !
IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. తొలి సీజన్‌లో షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నడిపించాడు.
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2008లో ప్రారంభించింది. ఐపీఎల్ తొలిసారి 2008 జనవరి 24న జరిగింది. నేటితో ఐపీఎల్ 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద ర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఓ ప్ర త్యేక పోస్ట ర్ ను విడుద ల చేసింది. ఈ పోస్టర్ లో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నారు. షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ తొలి సీజన్ లో ఛాంపియన్ గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ అత్యధిక ఐపీఎల్ టైటిట్ గెలిచిన జట్లుగా ఉన్నాయి. ఇప్పటివరకు 16 ఏండ్ల ప్రయాణంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్స్ ఇవే..
2008 - రాజస్థాన్ రాయల్స్ - షేన్ వార్న్
2009 - డెక్కన్ ఛార్జర్స్ - ఆడమ్ గిల్‌క్రిస్ట్
2010 – చెన్నై సూపర్ కింగ్స్ – ఎంఎస్ ధోని
2011 – చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోని
2012 - కోల్‌కతా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్
2013- ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
2014 - కోల్‌కతా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్
2015 - ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
India vs England : ఉప్పల్ స్టేడియం న్యూ లుక్ అదిరిపోయిందిగా !
2016 - సన్‌రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్
2017- ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
2018 - చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోని
2019 - ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
2020 - ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
2021 - చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోని
2022 - గుజరాత్ టైటాన్స్ - హార్దిక్ పాండ్యా
2023 - చెన్నై సూపర్ కింగ్స్ - ఎంఎస్ ధోని
ఇంగ్లాండ్ బాజ్ బాల్.. ఇండియా స్పిన్ బాల్.. ! గెలుపెవరిది..?
ఇదిలావుండగా, 2024 సంవత్సరం ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2024 ఫైనల్ మే 26న జరగనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్న ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సారి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తారనే చర్చ సాగింది. అయితే, భారత్ లోనే ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతుందని బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
IND v ENG: ఇంగ్లాండ్ 'బాజ్‌బాల్'పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్.. !