బాధ్యత అంటే ఇది : లండన్ నుంచి వచ్చి సెల్ప్ క్వారంటైన్‌లోకి.. సంగక్కరపై ప్రశంసలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ప్రకటించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ప్రకటించారు.
తనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని కానీ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటికే పరిమితం అయ్యానని సంగక్కర తెలిపాడు. వారం క్రితమే తాను లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చానన్నాడు.
Also Read:ఉదయం 6 నుంచి 9 వరకే అనుమతి: కఠినచర్యలకు సిద్ధమైన ఏపీ
మార్చి 1-15 మధ్య విదేశాల నుంచి వచ్చినవారు పోలీసుల వద్ద పేరు నమోదు చేసుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని వార్తల్లో చూసి ప్రభుత్వ మార్గదర్శకాలను ఫాలో అవుతున్నానని చెప్పాడు.
మరోవైపు కొందరు వ్యక్తులు కరోనా వైరస్ లక్షణాలున్నా దాచి పెడుతున్నారని శ్రీలంక ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు శ్రీలంకలో 80 కరోనా కేసులు నమోదైనట్లు సర్కార్ ప్రకటించింది.
సంగక్కర కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెప్సీ సైతం రెండు వారాల స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. ఆయన ఈ మధ్యే ఇంగ్లాండ్‌లోని ససెక్స్ జట్టుకు కోచింగ్ ఇస్తున్నారు. కరోనా కారణంగా మ్యాచ్‌లు వాయిదా పడటంతో ఆయన స్వదేశానికి వెళ్లిపోయారు.
Also Read:ప్రపంచం విలవిల: 15 వేలు దాటిన కరోనా మృతులు
సోమవారం సాయంత్రం నాటికి కోవిడ్-19 ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. ఇందులో యూరప్‌కు చెందిన వారే 9,197 మంది ఉన్నారు. తాజాగా స్పెయిన్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది.
గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది వైరస్ కారణంగా మరణించగా.. ఇందులో 462 మంది స్పెయిన్ దేశస్తులే ఉన్నారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరినట్లు స్పెయిన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.