Asianet News TeluguAsianet News Telugu

cricket: శ్రీలంక టీమ్ టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వా..

Sri Lanka cricket: శ్రీలంక కొత్త టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వా ఎంపికయ్యాడు. ఇప్పటివరకు 51 టెస్టులు ఆడి 40 కంటే తక్కువ సగటుతో 3301 పరుగులు చేశాడు.
 

Sri Lanka cricket: Dhananjaya de Silva replaces Dimuth Karunaratne as Sri Lanka's Test captain RMA
Author
First Published Jan 4, 2024, 1:15 PM IST

Sri Lanka's new Test captain: దిముత్ కరుణరత్నే స్థానంలో శ్రీలంక తమ స్టార్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ ధనుంజయ డిసిల్వాను టెస్టు క్రికెట్ లో కెప్టెన్ గా నియమించింది. దీంతో రెడ్ బాల్ ఫార్మాట్లో శ్రీలంకకు కెప్టెన్ గా వ్యవహరించిన 18వ ఆటగాడిగా ధనుంజయ నిలిచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ లో సొంతగడ్డపై శ్రీలంక 2-0 తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో జ‌ట్టు సార‌థిని మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంతగడ్డపై ఆడుతున్న లంక..  అప్పటి బాబర్ అజామ్ సారథ్యంలోని పాక్ జట్టుపై విజయం సాధిస్తుందని భావించినప్పటికీ పరాజయం పాలై గాలేలో జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో, కొలంబోలోని ఎస్ ఎస్ సీ (సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ )లో జరిగిన రెండో మ్యాచ్ లో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడిపోయింది.

డబ్ల్యూటీసీ 2023-25 సీజన్ లో జట్టుకు మార్గనిర్దేశం చేయడానికి కొత్త నాయకుడిని కోరుకున్న కరుణరత్నే 2023 మార్చిలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆకాంక్షను వ్యక్తం చేశాడు. 'ఐర్లాండ్ సిరీస్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై సెలక్టర్లతో మాట్లాడాను. వచ్చే డబ్ల్యుటీసీ క్ర‌మంలో కొత్త కెప్టెన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనిపై సెలెక్టర్లతో మాట్లాడాను, కానీ ఇంకా స్పందన రాలేదు. తదుపరి సిరీస్ తర్వాత కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించడమే నా ప్రాధాన్యత' అని కరుణరత్నే తెలిపిన‌ట్టు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదించింది.

ఇదిలా ఉంటే ధనుంజయుడి ముందు బ‌ల‌మైన ప‌రీక్ష ఉంది. ఆగస్టులో ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ ల‌ సిరీస్ రూపంలో కెప్టెన్ గా అతని తొలి విదేశీ టెస్టు సిరీస్ ను శ్రీలంక టీమ్ ఆడ‌నుంది. ధనుంజయ 51 టెస్టులు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంకకు ఇంకా కెప్టెన్ గా వ్యవహరించలేదు. సుదీర్ఘ ఫార్మాట్ లో 10 సెంచరీలు, 13 అర్ధసెంచరీలతో 3301 పరుగులు చేశాడు. ఇక 2019 నుంచి 2023 మధ్య 30 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన దిముత్ కరుణరత్నే నుంచి డిసిల్వా శ్రీలంక టెస్టు జట్టు పగ్గాలను చేపట్టాడు.

Virat Kohli: ఇద్ద‌రు పాక్ దిగ్గ‌జాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios