Asianet News TeluguAsianet News Telugu

రషీద్ ఖాన్ తో సూపర్ ఓవర్ ఎందుకు వేయించానంటే: విలియమ్సన్

ఐపిఎల్ సీజన్ 12 లో మరో ఉత్కంటభరిత మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ గురువారం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ మద్య జరిగిన మ్యాచ్ చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరికి ఫలితం తేలకపోవడంతో సూపర్ ఓవర్ ద్వారా ముంబై విజయం సాధించి ప్లేఆఫ్ కు మరింత దగ్గరవగా సన్ రైజర్స్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ ఓటమికి సన్ రైజర్స్ కెప్టెన్ అనాలోచిత నిర్ణయమే కారణమని హైదరాబాద్  అభిమానులు మండిపడుతున్నారు. సూపర్ ఓవర్ ని స్పిన్నర్ తో వేయించడమే ఫలితాన్ని తారుమారుచేసిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్పందించాడు. 

srh captain kane williamson comments about super over in mumbai match
Author
Mumbai, First Published May 3, 2019, 2:21 PM IST

ఐపిఎల్ సీజన్ 12 లో మరో ఉత్కంటభరిత మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికయ్యింది. ఇక్కడ గురువారం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ మద్య జరిగిన మ్యాచ్ చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరికి ఫలితం తేలకపోవడంతో సూపర్ ఓవర్ ద్వారా ముంబై విజయం సాధించి ప్లేఆఫ్ కు మరింత దగ్గరవగా సన్ రైజర్స్ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ ఓటమికి సన్ రైజర్స్ కెప్టెన్ అనాలోచిత నిర్ణయమే కారణమని హైదరాబాద్  అభిమానులు మండిపడుతున్నారు. సూపర్ ఓవర్ ని స్పిన్నర్ తో వేయించడమే ఫలితాన్ని తారుమారుచేసిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్పందించాడు. 

సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన తాము కేవలం 8 పరుగులు మాత్రమే  చేయగలిగామని విలియమ్సన్ గుర్తుచేశారు. ఇంత చిన్న లక్ష్యాన్ని కాపాడుకోడానికి ప్రపంచ స్థాయి బౌలర్ అవసరమని భావించే రషీద్ ఖాన్ చేతికి బంతిని అందించినట్లు తెలిపాడు. అతడు స్పీన్ బౌలింగ్ తో మాయ చేస్తాడని నమ్మామని... కానీ అలా జరగలేదని విలియమ్సన్ వెల్లడించాడు. 

అంతకుముందు మనీశ్ పాండే (47 బంతుల్లో 71 పరుగులు) బ్యాటింగ్ బాద్యతలు మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని  అద్భుతంగా పోరాడాడని విలియమ్సన్ కొనియాడాడు. కానీ అతడికి తనతో సహా మిగతా బ్యాట్ మెన్స్ ఎవరినుండి సహకారం  అందలేదన్నారు. చివరకు నబీ (30 పరుగులు)లతో అతడికి తోడుగా నిలిచి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారని విలియమ్సన్ తెలిపాడు.  

సూపర్ ఓవర్ ను స్పిన్నర్ రషీద్ ఖాన్ తో కాకుండా పేసర్లతో వేయించివుంటే ఫలితం మరోలా వుండేదని హైదరాబాద్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యార్కర్లతో బ్యాట్ మెన్స్ బెంబేలెత్తించే భువనేశ్వర్ వంటి బౌలర్ ని కాదని స్పిన్నర్ తో సూపర్ ఓవర్ వేయించడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. కెప్టెన్ తప్పుడు నిర్ణయానికి జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని వారు విలియమ్సన్ ను విమర్శిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

సూపర్ ఓవర్ వేయడానికి బుమ్రానే ఎందుకంటే: రోహిత్
 
Follow Us:
Download App:
  • android
  • ios