మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్స్ లో టీమిండియా ఓటమి పాలవ్వగా... ఆస్ట్రేలియా మహిళల జట్టు కప్పు గెలిచింది.  అయితే... ఈ మ్యాచ్ ఫైనల్స్ వీక్షించడానికి వెళ్లిన ఓ ప్రేక్షకుడికి ఇప్పుడు కరోనా వైరస్ సోకింది.

Also Read భారత్, దక్షణాఫ్రికా మ్యాచ్ :వర్షంతో మ్యాచ్ రద్దు..? బాధ్యులు ఆ పూజారులే!.

ఈ మ్యాచ్ మార్చి 8వ తేదీన జరగింది. కాగా.. తాజాగా మ్యాచ్ చూడటానికి వచ్చినవారిలో ఓ క్రికెట్ అభిమానికి కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే... అతని కారణంగా ఆ రోజు మ్యాచ్ చూసినవారందరికీ సమస్య తలెత్తే అవకాశం ఉందనడానికి లేదు అని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

అతనికి వైరస్ సోకినంత మాత్రాన ఆ మ్యాచ్ కి వచ్చిన ఇతరలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రిస్క్ చాలా తక్కువగా ఉందని సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకే చెప్పడం గమనార్హం. కాగా.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా చివరిదాకా పోరాడినా ఫలితం దక్కలేదు.