సిడ్నీ: ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా ఫైనల్ కు చేరుకోవడంపై దక్షిణాఫ్రికా కెప్టెనె డేన్ వాన్ నీకెర్క్ అక్కసు వెళ్లగక్కింది.  నేరుగా ఆమె ఇండియా పేరు ప్రస్తావించకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గురువారం సిడ్నీ వేదికగా ఇంగ్లాండు, భారత్ మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన ఇండియా ఫైనల్ కు చేరుకుంది.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ మ్యాచు మాత్రం జరిగింది. వర్షం పడినప్పటికీ మ్యాచు చాలా వరకు సాగింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచు జరగకున్నా భారత్ ఫైనల్ కు చేరుకోవడంపై వాన్ నీకెర్క్ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

Also Read: ఇండియాతో ఆడాలంటే ఆసహ్యం, వారిద్దరికీ బౌలింగ్ చేయను: ఆసీస్ బౌలర్

ఆడకుండా ఫైనల్ చేరుకోవడం కన్నా సెమీ ఫైనల్ లో ఓడిపోవడం బెటర్ అని ఆమె వ్యాఖ్యానించింది. తాను కూర్చుని అబద్ధాలు చెప్పదలుచుకోలేదని, తాము గెలిచి ఫైనల్ కు చేరుకోవాలని ప్రయత్నించామని, వర్షం వల్ల ఆగిపోయి లీగ్ దశలో అత్యధిక విజయాలు సాధించిన తాము ఫైనల్ కు చేరుకోవాలని అనుకోలేదని, ఫ్రీగా ఫైనల్ కు పాస్ కావడం  కన్నా ఆడి ఓడిపోవడం బెటర్ అని ఆమె అన్నది.

See Video: వరల్డ్ టి 20 ఫైనల్ : ఆ నిమిషం ఎలా ఆడారన్నదే ముఖ్యం..సచిన్ టెండుల్కర్

నీకెర్క్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే స్పందించారు. మనం మ్యాచ్ ఆడి ఫైనల్ కు వెళ్లామా, లేక ఫ్రీ పాస్ తోనా అనేది మన చేతుల్లో లేదని ఆయన అన్నారు. ఎవరు ఫైనల్ కు చేరినా ఫ్రీగా వెళ్లరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. గ్రూప్ దశలో బాగా ఆడినందువల్లనే ఇండియా ఫైనల్ కు ఆర్హత సాధించిందని ఆయన అన్నారు.