దాదా క వాదా: బుమ్రా కోసం గంగూలీ జోక్యం...

గాయం నుంచి కోలుకున్న తరువాత ఏ ఆటగాడైనా తిరిగి జాతీయ జట్టుతో కలిసి ఆడడానికి ముందు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడవాలిసి ఉంటుంది. ఎవరైనా సరే ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సిందే.

Sourav Ganguly steps in, no Ranji Trophy game for Jasprit Bumrah

ముంబై: గాయం నుంచి కోలుకున్న తరువాత ఏ ఆటగాడైనా తిరిగి జాతీయ జట్టుతో కలిసి ఆడడానికి ముందు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడవాలిసి ఉంటుంది. ఎవరైనా సరే ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సిందే. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ కూడా ప్రస్తుతం ఢిల్లీ కి కెప్టెన్ గా హైదరాబాద్ తో జరుగుతున్న రంజీ మ్యాచులో ఆడుతున్నాడు. 

ఇలానే గాయం కారణంగా జట్టుకు దూరమై ప్రస్తుతం టీం ఇండియాతో చేరడానికి సిద్ధంగా ఉన్న మరో ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా. మొన్నటిదాకా బుమ్రా ఫిట్నెస్ పరీక్షకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తరువాత అది ఒకింత సమసిపోయింది. 

Also read: బుమ్రా ఫిట్నెస్ వివాదం...నా జోక్యం తప్పనిసరి: గంగూలీ

అప్పుడు బుమ్రా తరుఫున ఒకింత వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన గంగూలీ మరోసారి బుమ్రాకు మానవతా దృక్పథంతో క్రికెట్ నియమాలను ఒకింత సడలించాడు. నిన్నటివరకు కూడా బుమ్రా గుజరాత్ తరుఫున బరిలోకి దిగి కేరళతో మ్యాచ్ ఆడతారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు బుమ్రా ఆ మ్యాచ్ ఆడబోవటం లేదని తేలింది. దీనికి ఒక బలమైన కారణం కూడా లేకపోలేదు. 

బుమ్రా వాస్తవానికి సూరత్ బయల్దేరి వెళ్లి అక్కడ కేరళతో మ్యాచ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే టెస్టు మ్యాచ్ కావడం వల్ల విపరీతంగా బౌలింగ్ చేయవలిసి వస్తుంది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ, మరి స్ట్రైన్ పడకుండా జాగ్రత్తగా తన ఫిట్నెస్ ను కాపాడుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. 

వచ్చే సంవత్సరం భారీ స్థాయిలో రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్ ఆడనున్నాడు బుమ్రా. ఇప్పటి నుండే అంత స్ట్రైన్ అవసరం లేకుండా నెమ్మది నెమ్మదిగా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చూపించడం మొదలుపెట్టాలని టీం యాజమాన్యం కూడా ఆలోచిస్తుంది. 

ఈ నేపథ్యంలో నే గుజరాత్ టీం మానేజ్మెంట్ ముందు టీం ఇండియా ప్రతినిధులు ఒక ప్రతిపాదన పెట్టారు. బుమ్రా తో రోజుకు నాలుగు నుంచి ఎనిమిది ఓవెన్లకు మించి బౌలింగ్ చూపించొద్దని కోరారట.

కేవలం రోజుకి ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే బౌలర్ ను తీసుకుంటే టీం గా చాలా నష్టపోతామని భావించిన గుజరాత్ ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదట. 

దీనితో బుమ్రా నేరుగా గంగూలీని సంప్రదించాడట. వెంటనే గంగూలీ రంగంలోకి దిగి జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు ఇలా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడటం నుంచి మినహాయింపును కల్పించాడు. గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కూడా బుమ్రా ఈ మ్యాచులో ఆడబోవడంలేదని తేల్చేసాడు. 

Also read: ఈ దశాబ్దపు సారథులు: ధోని, కోహ్లీ లకు అరుదైన గౌరవం

కాబట్టి బుమ్రా ఇప్పుడు నేరుగా శ్రీలంకతో జరిగే టి 20 సిరీస్ లోనే మనకు బౌలింగ్ చేస్తూ కనపడబోతున్నాడు. భారత్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాత్రమే టెస్టు మ్యాచ్ ఆడబోతుంది.

దానికి ఇంకా టైం ఉంది. అప్పటివరకు బుమ్రా టి 20ల్లో 4 వర్ల చొప్పున వన్డేల్లో 10 వర్ల చొప్పున మాత్రమే బౌలింగ్ చేస్తే సరిపోతుంది. అంతకు అవసరం వస్తే టెస్టు సిరీస్ కి ముందు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అప్పుడు కావాలంటే ఆడతాడని టీం యాజమాన్యం ఆలోచిస్తుందట.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios