క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి భారత సూపర్‌స్టార్స్ కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎంపిక చేసిన ఈ దశాబ్దపు (2010-2019) వన్డే, టెస్టు జట్లకు మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి లు నాయకులుగా ఎంపికయ్యారు. 

సీఏ ఎంపిక చేసిన 11 మంది వన్డే జట్టులో ధోని సహా ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సాధించారు. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలోని టెస్టు జట్టులో మాత్రం మిగితా భారత ఆటగాల్లకు  స్థానం దక్కలేదు. 

ఇంతమంది దిగ్గజాలుండగా ధోనిని ఎందుకు ఎంపిక చేశారు అనే అనుమానం కలగొచ్చు కూడా. అందునా ఈ మధ్య కాలంలో ధోని ఆటతీరు మునపటిలాగా లేదు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఎందుకు ఇతడ్ని చేయవలిసి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. దీనికి ఆ బోర్డు సభ్యుడు కూడా స్పందించాడు. 

సెలక్షన్ కమిటీ సభ్యుడు స్మిత్ మాట్లాడుతూ...  ఈ దశాబ్దం చివర్లో బ్యాట్‌తో ధోని పాత్ర గణనీయంగా తగ్గి ఉండవచ్చు, కానీ భారత వన్డే స్వర్ణ యుగంలో మహిది తిరుగులేని పాత్ర అని, 2011 ప్రపంచకప్‌ విజయాన్ని అందించిన ధోని.. వన్డేల్లో ఎదురులేని ఫినీషినర్‌ అని సీఏ సెలక్షన్‌ ప్యానల్‌లోని సభ్యుడు, పాత్రికేయుడు మార్టిన్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. 

Also read: ఐసిసికి బిసీసీఐ 'సూపర్'టోకరా: గంగూలీ గురి ఎవరిపైన...?

విరాట్‌ కోహ్లి అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌గా స్మిత్‌ అభివర్ణించాడు. వన్డేల్లో మూడు ద్వి శతకాలు బాదిన వీరుడు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ వన్డే జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు.

వన్డే జట్టు : ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, జోస్  బట్లర్‌, రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగ.

టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అలస్టర్‌ కుక్‌, డేవిడ్  వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, డెల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌.