బుమ్రా ఫిట్నెస్ వివాదం...నా జోక్యం తప్పనిసరి: గంగూలీ

బుమ్రాకు నిబంధనల ప్రకారం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఓ వైపు ఎన్‌సీఏ ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లబోనని బుమ్రా తెలియజేశాడని చెబుతుండగా, ఎన్‌సీఏ అధికారులు సైతం బుమ్రాకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించమని బోర్డుకు తెలిపినట్టు సమాచారం. ఈ విషయం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు

ganguly to interfere in the bumrah fitness isuue,says will talk to dravid

భారత స్టార్‌ సీమర్‌ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్య బీసీసీఐలో కొత్త వివాదానికి తెరదీసేలా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రెగ్యులర్‌ వైద్య పరీక్షల్లో బుమ్రా స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌ గాయానికి గురైనట్టు బీసీసీఐ ప్రకటించింది. 

బ్రిటన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న బుమ్రా, అనంతరం రిహాబిలిటేషన్ ను జాతీయ క్రికెట్‌ అకాడమీలో కొనసాగించనని చెప్పాడు. బుమ్రా ఇష్టప్రకారం ముంబయిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రైనర్‌ రజినీకాంత్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. 

Also read: బుమ్రాపై రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం: అసలేం జరిగింది?

ఇటీవల విశాఖ వన్డేకు ముందు టీమ్‌ ఇండియా నెట్స్‌లో సౌకర్యవంతంగా బౌలింగ్‌ చేసిన బుమ్రాకు నిబంధనల ప్రకారం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఓ వైపు ఎన్‌సీఏ ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లబోనని బుమ్రా తెలియజేశాడని చెబుతుండగా, ఎన్‌సీఏ అధికారులు సైతం బుమ్రాకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించమని బోర్డుకు తెలిపినట్టు సమాచారం. 

ఈ విషయం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ' నేను బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికై కొంత కాలమే అవుతోంది. ఈ విషయంపై రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడతాను. విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని, పరిష్కరిస్తాం. బుమ్రా గాయానికి గురై చాలా కాలమైంది. అప్పుడు నేను బీసీసీఐలో లేను. నన్ను అడిగితే ఎన్‌సీఏ కేరాఫ్‌ భారత క్రికెటర్లు. ఏ విషయమైనా ఎన్‌సీఏ ద్వారానే జరగాలి. భారత అంతర్జాతీయ క్రికెటర్లు ఎన్‌సీఏ తొలి ప్రాధాన్యం, అదే అంతిమం' అని గంగూలీ అన్నాడు.

త్వరలో సీఏసీ : 

విరుద్ధ ప్రయోజనాల నిబంధన కారణంగా క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) నియామకం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీకి ఎప్పుడో కాలం చెల్లగా.. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌, శాంత రంగస్వామిల కమిటీ ఇటీవల తప్పుకుంది. 

సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీ కాలం ముగియటంతో చీఫ్‌ సెలక్టర్‌ను నియమించాల్సి ఉంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సెలక్షన్‌ కమిటీని సీఏసీ నియమించాలి. 

' ఇప్పటికే మెన్స్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ ఎంపిక జరిగింది. ఇప్పుడు సెలక్షన్‌ కమిటీ సభ్యుల కోసం ఒకే ఒక్క సమావేశం నిమిత్తం క్రికెట్‌ సలహా సంఘాన్ని నియమించనున్నాం. నూతన సెలక్షన్‌ కమిటీ పదవీ కాలం మూడేండ్లు' అని గంగూలీ తెలిపాడు.

ఇక పనిలోపనిగా ధోని రిటైర్మెంట్ పైకూడా గంగూలీ స్పందించాడు. ' వీడ్కోలు నిర్ణయం ధోనిదే. మహికి ఎంతో అనుభవం ఉంది. అతడికి ఏది మంచిదో అతడికి బాగా తెలుసు అని నా నమ్మకం' అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios