దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ మహిళా జట్టు సారధి సోఫీ డివైన్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. వరసగా ఐదు టీ20ల్లో 50కిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా సోఫీ నిలిచింది. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్ లో సోఫీ సెంచరీ బాదేసింది. ఈ సిరీస్ కి ముందు భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆమె 72 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికాతో  జరిగిన గత మూడు టీ20ల్లో వరసగా 54, 61,77 పరుగులు చేసింది.

Also Read కివీస్ పై ఇండియా బ్యాటింగ్: పృథ్వీ షా ఔట్, మూడో వికెట్ డౌన్...

ఈ క్రమంలో సోఫీ... మిథాలీరాజ్, బ్రెండన్ మెకకలమ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేయడం విశేషం. వీళ్లంతా టీ20 ఫార్మాట్లలో వరసగా నాలుగు ఇన్నింగ్స్ లో మాత్రమే 50కి పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు సోఫీ వారిని అధిగమించింది. 

మరోవైపు ఈ మ్యాచ్ లో శతకం బాదిన సోఫీ.. టీ20ల్లో కివీస్ తరపున మూడంకెల స్కోర్ అందుకున్న రెండో మహిళా క్రికెటర్ గా నిలచింది. అంతకముందు తన సహచర క్రికెటర్ సుజీ బేట్స్ మహిళా జట్టులో తొలి సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 17 ఓవర్లలోనే 102 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ 69 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1 తో సిరీస్ కైవసం చేసుకుంది.