Asianet News TeluguAsianet News Telugu

టీ20 పరాజయానికి ఇండియాపై స్వీట్ రివెంజ్: వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్

భారత్ చేతిలో టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

New Zealand vs India third oneday updates
Author
Mount Maunganui, First Published Feb 11, 2020, 8:01 AM IST

భారత్ చేతిలో టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆల్ రౌండర్ కోలిన్ గ్రాండ్‌హోమ్ 21 బంతుల్లోనే అర్థసెంచరీ చేసి భారత్‌కు చుక్కలు చూపించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో నికోలసర్ 80, గప్టిల్ 66, గ్రాండ్‌హోమ్ 58 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, శార్దూల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 66, హెన్రీ నికోలస్ 80 పరుగులు చేసి తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మార్టిన్ గప్తిల్ 66 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌‌లో ఔటయ్యాడు.

లక్ష్యఛేదనలో మూలస్తంభంలా నిలబడ్డ ఓపెనర్ నికోలస్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శార్ధుల్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే టామ్ లేథమ్, జేమ్స్ నీషమ్ క్రీజులో ఉండటంతో మ్యాచ్ ఇంకా న్యూజిలాండ్ వైపే ఉంది. విజయానికి న్యూజిలాండ్ దగ్గరవుతున్న క్రమంలో చాహల్ రెచ్చిపోయాడు. అంతకుముందు విలియమ్సన్‌ను ఔట్ చేసిన చాహల్ జట్టు స్కోరు 220 వద్ద ఉండగా జేమ్స్ నీషమ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ క్యాచ్ ఇచ్చి నీషమ్ ఔటయ్యాడు.

న్యూజిలాండ్ పై మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. చివరలో శార్దూల్ ఠాకూర్ ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ నాలుగు వికెట్లు తీయగా, జమీషన్,నీషంలకు చెరో వికెట్ దక్కింది.

సెంచరీ చేసిన కొద్దిసేపటికే కేెఎల్ రాహుల్ అవుటయ్యాడు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. 113 బంతుల్లో అతను 112 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో భారత్ 269 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోియింది.104 బంతుల్లో అతను వంద పరుగులు చేశాడు. ఇది వన్డేల్లో అతనికి నాలుగో సెంచరీ. అతను 66 బంతులను ఎదుర్కుని 50 పరుగులు చేశాడు.

ఆ తర్వాత వెంటనే మనీష్ పాండే అదే స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ 269 పరుగుల వద్దనే ఆరో వికెట్ కోల్పోయింది. అతను 42 పరుగులు చేసి వెనుదిరిగాడు. త్వరగా వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్, మనీష్ పాండే ఇండియాను ఆదుకుని ఇన్నింగ్సును నిర్మించారు.

న్యూజిలాండ్ పై తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 162 పరుగుల వద్ద నాలుగో వికెెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేసి నీషమ్ బౌలింగులో అవుటయ్యాడు.

అంతకు ముందు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్ అయ్యర్ అర్థ సెంచరీ చేశాడు. వన్డే సిరీస్ లో అతను రాణించాడు.న్యూజిలాండ్ పై చివరిదీ మూడోది అయిన వన్డేలో 62 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా 40 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు.

భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ అవుట్ కావడంతో ఇండియా 18 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ బెన్నెట్ బౌలింగులో వెనుదిరిగాడు.

మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి జమీసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో 8 పరుగుల స్కోరు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.అంతకు ముందు న్యూజిలాండ్ భారత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి రెండు వన్డేలు గెలిచి న్యూజిలాండ్ ఇండియాపై సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios