శుక్రవారం మొహాలీలో ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఔట్ కానప్పటికీ.. అంపైర్ ఫాశ్చిమ్ పాఠక్ ఔట్ ఇవ్వడంతో అతను కొద్దిసేపు క్రీజులోనే ఉండిపోయాడు.

తాను ఎట్టి పరిస్ధితుల్లోనే క్రీజును వదిలి వెళ్లేది లేదని మొండికేసిన గిల్... అంపైర్‌ను దూర్భాషలాడుతూ తిట్ల దండకం అందుకున్నాడు. దీంతో ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరికి రిఫరీ మళ్లీ జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో శుభమన్ గిల్ పెవిలియన్ చేరాడు. 

Also Read:ఇలాంటి పరిస్థితుల్లోనూ బతికి ఉన్నాం... డేవిడ్ వార్నర్ ఎమోషనల్

అసలు వివాదంలోకి వెళితే.. ఢిల్లీ బౌలర్ సిమర్ జీత్ సింగ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని గిల్ ఆడాడు. అది బ్యాట్‌కు తగలకుండానే వెళ్లి అనుజ్ రావత్ చేతుల్లో పడింది. దీనిపై ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ పాఠక్ ఔట్ ఇచ్చాడు.

ఇది ఔట్ కాదని గిల్‌కు తెలియడంతో అతను క్రీజ్‌ను వదల్లేదు. టీవీ రిప్లేలో సైతం ఇదే తేలడంతో గిల్‌ పట్టు వదల్లేదు. రిఫరీ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో శుభ్‌మన్ గిల్‌ వ్యవహారం సద్దుమణిగింది.

Also Read:నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్

అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు విజేతలుగా నిలవాల్సిన జట్లు ఓటమి పాలవ్వడంతో ఐసీసీ సైతం సరికొత్త నిబంధనలు తీసుకొస్తోంది. కాగా.. తాజా వివాదం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రచ్చ చేసే అవకాశాలు లేకపోలేదు. 

కాగా గతేడాది డిసెంబర్‌ నెలలో ముంబై-బరోడా జట్ల మధ్య ముంబైలో జరిగిన రంజీ మ్యాచ్‌లోనూ అచ్చం ఇదే రకమైన ఘటన జరిగింది. బరోడా తరపున ప్రాతినిథ్యం వహించిన యూసఫ్ పఠాన్ ఔట్ కాకపోయినా అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజును వదిలాడు.