ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ డేవిడ్ వార్నర్ ఎమోషనల్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు సంభవించింది. ఈ కార్చిర్చు కారణంగా ఇప్పటికే 18మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా... ఈ ఘటనపై డేవిడ్ వార్నర్ స్పందించారు. 

తన సోషల్ మీడియాలో దీనిపై ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. కార్చిచ్చుని ఓ వ్యక్తి పక్కనే తన కుక్కతో కూర్చొని చూస్తున్నట్లుగా ఉంది ఆ ఫోటో. దానికి వార్నర్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘‘ నేను ఇప్పుడే ఈ ఫోటో చూశాను. ఇంకా షాక్ లోనూ ఉన్నాను. ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ జట్లు రేపు మ్యాచ్ ఆడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవించి ఉన్నాం. ఎంత అదృష్టవంతులమో.. ఎన్నటికీ మర్చిపోలేను’ అంటూ పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో ఈ మంటలను ఆర్పే అగ్నిమాపక సిబ్బందితోపాటు.. వారికి సహకరిస్తున్న వాలంటీర్లందరికీ  నాతోపాటు మా కుటుంబసబ్యుల ఆశీస్సులు ఉంటాయి అంటూ ట్వీట్ చేశారు. ఈ మంటలు మాటలకందనివని.. వీటిని ఆర్పుతున్న మీరే అసలైన హీరోలు అంటూ అగ్నిమాపక సిబ్బందిని ఉద్దేశించి పేర్కొన్నారు. 

 

తామంతా గర్వపడేలా ప్రకృత్తి విపత్తులను ఎదుర్కొంటున్నారని.. వారే అసలు హీరోలు అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నేడు సిడ్నీ వేదికగా ఆసీస్, కివీస్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, మంటలు తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడి గాలి నాణ్యత క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ దట్టమైన పొగమంచు కప్పేస్తే.. అంపైర్ల పరిస్థితి బట్టి మ్యాచ్ ని నిలిపివేసే అవకాశం ఉంది.