నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్
హార్దిక్ పాండ్యా శరీర రంగు నలుపు కాగా... నటాషా మాత్రం మిల్క్ బ్యూటీ. దీంతో వీరిద్దరి ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకరు పాండ్యాని థమ్సప్ కూల్ డ్రింక్ తో పోల్చి... నటాషాని లింకా కూల్ డ్రింక్ తో పోల్చడం గమనార్హం.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంగేజ్ మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌తో తాజాగా పాండ్యా నిశ్చితార్థం చేసుకున్నాడు. బుధవారం ఉదయం తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసిన హార్దిక్ పాండ్యా.. సాయంత్రం నిశ్చితార్థం అయిపోయినట్లు ఫొటోల్ని షేర్ చేశాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.
AlsoRead ప్రియురాలితో హార్దిక్ న్యూఇయర్ సంబరాలు... నెటిజన్ల రెస్పాన్స్ ఇదే.
అయితే.... ఆనందంగా తన ఫోటోలను పాండ్యా షేర్ చేసుకోగా... అతనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాల్సిన జనాలు ట్రోల్ చేస్తున్నారు. నీ కలర్ ఇలాంటి అమ్మాయా అంటూ.. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
హార్దిక్ పాండ్యా శరీర రంగు నలుపు కాగా... నటాషా మాత్రం మిల్క్ బ్యూటీ. దీంతో వీరిద్దరి ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకరు పాండ్యాని థమ్సప్ కూల్ డ్రింక్ తో పోల్చి... నటాషాని లింకా కూల్ డ్రింక్ తో పోల్చడం గమనార్హం.
కాగా... కొందరు చేస్తున్న ఈ ట్రోల్స్ కి పాండ్యా ఫ్యాన్స్ కాస్త గట్టిగానే సమాధానం చెబుతున్నారు. కేవలం రంగుని చూసి ట్రోల్ చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. వయసు పెరిగినా చాలా మంది మళ్లీ పాఠశాలకు వెళ్లాల్సిన అసవరం ఉందని ఓ నెటిజన్ ట్రోలర్స్ పై మండిపడ్డారు.
పాండ్యా చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అని.. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండియన్ క్రికెటర్ స్థాయికి ఎదిగాడంటూ కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వెన్ను గాయం కారణంగా గత సెప్టెంబరు నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్య.. సర్జరీ చేయించుకుని ఇటీవల ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో.. జనవరి ఆఖర్లో న్యూజిలాండ్ పర్యటనకి అతడ్ని ఎంపిక చేయాలని యోచిస్తున్న భారత సెలక్టర్లు.. దేశవాళీ క్రికెట్‌లో కనీసం ఒక్క మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సూచించారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. హిట్టింగ్‌తో అదరగొడుతున్న విషయం తెలిసిందే.
2016, జనవరిలో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా.. అనతికాలంలోనే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఒకానొక దశలో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో ఈ క్రికెటర్‌ని పోల్చారు. కానీ.. 2019లో వివాదాలు, గాయాలు అతడి కెరీర్‌ని కాస్త దెబ్బతీశాయి. గత ఏడాది ఆరంభంలోనే కాఫీ విత్ కరణ్ టాక్ షోకి హాజరై అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ రెండు వారాలు నిషేధం విధించింది. ఆ తర్వాత వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో కీలకమైన సిరీస్‌లకి ఈ ఆల్‌రౌండర్ దూరమయ్యాడు.