విజయ్ లియో పాటకు శిఖర్ ధావన్ స్టెప్పులు..!
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్ జోష్ కి నెటిజ్లు ఫిదా అయిపోతున్నారు. సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. టీమ్‌లో ఉన్నా లేకపోయినా ధావన్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే కాదు, మామూలు సమయంలోనూ ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఓ బాలీవుడ్ మూవీలోని మెరిశాడు.
అయితే, వీలు దొరికినప్పుడల్లా, శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఆయన రీల్స్ కి కూడా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధావన్ జోష్ కి నెటిజ్లు ఫిదా అయిపోతున్నారు. సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. టీమ్‌లో ఉన్నా లేకపోయినా ధావన్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శిఖర్ ధావన్ టీమ్ లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన, మళ్లీ టీమ్ లోకి ఎప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ కి టీమ్ లో చోటు దక్కడం కష్టమనే అనిపిస్తోంది. యువ క్రికెటర్లు సత్తా చాటుటుండటంతో ధావన్ కి చోటు దక్కడం కష్టమనే అనిపిస్తోంది, అయితే ధావన్ మాత్రం వరల్డ్ కప్ పై ఆశలు పెట్టుకున్నాడు.