వేలికి గాయం, వాచిన మెడ, కంటికి గాయం, మోకాలికి గాయం..లిస్టు ఇంకా చాంతాడంత ఉంది.  ఇలా శిఖర్‌ ధావన్‌ను 2019 గాయాలతో వెంటాడింది. వరుస గాయాల నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ కొత్త ఏడాదిని కొత్తగా మొదలెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. 

నేటి నుంచి హైదరాబాద్‌తో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీని ధావన్‌ ముందుండి నడిపించనున్నాడు. ఈ మ్యాచుకు ముందు ధావన్ స్పందిస్తూ... ఇది తనకు కొత్త ఆరంభమని, తొలుత వేలికి, తర్వాత మెడకు, ప్రస్తుత మోకాలి గాయం ఇలా అన్ని గాయాలు తనను ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. 

కొత్త ఏడాది రానుండం సంతోషకరమైన వార్త అని, కెఎల్‌ రాహుల్‌ రాణించటం సంతోషం కలిగించిందని భారత మరో ఓపెనర్ రాహుల్ ఆటతీరును కోపానియాడాడు. వచ్చిన అవకాశాన్ని రాహుల్‌ సద్వినియోగం చేసుకున్నాడని ధావన్ అభిప్రాయపడ్డాడు. 

Also read: శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు భారత జట్టు ఇదే

ఇప్పుడు ధనాధన్‌ ఆడటం తన వంతు అని, గాయాలు తన లయను దెబ్బతీయలేవని, ఎలా బ్యాటింగ్‌ చేయాలో తాను ఇంకా మరిచిపోలేదని ధావన్ అన్నాడు. తన క్లాస్‌ శాశ్వతం అని, ధాటిగా పరుగులు చేయగలనని ఆశాభావం వ్యక్తం చేసాడు ధావన్. 

హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న శిఖర్‌ ధావన్‌ విలేకరులతో మాట్లాడాడు. గాయంతో వెస్టిండీస్‌ సిరీస్‌కు దూరమైన ధావన్‌ శ్రీలంకతో టీ20లు, ఆస్ట్రేలియాతో వన్డేల్లో తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడనున్నాడు.

ఇలా గాయం కారణంగా రెస్ట్ తీసుకొని తిరిగి ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టుతో కలిసి ఆడాలంటే... ఫస్ట్ క్లాస్ మ్యాచులో ఆడవాలిసి ఉంటుంది. అందుకోసమని ధావన్ ఇలా ఆడుతున్నాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ తరుఫున ఇప్పటికే శతకం బాది 110 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో కొనసాగుతున్నాడు.