అరుదైన రికార్డు నెలకొల్పాడు. రంజీల్లో 605 పరుగుల తర్వాత తొలిసారి ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో 301, 226 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సర్ఫరాజ్.. మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల వద్ద కమ్‌లేశ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

సర్ఫరాజ్ కంటే ముందు తమిళనాడు క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ 1989లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో ట్రిపుల్ సెంచరీ, డబుల్ సెంచరీ చేశారు. ఆ తర్వాత ఇలాంటి రికార్డు నెలకొల్పిన తొలి ముంబై బ్యాట్స్‌మెన్‌గా సర్ఫరాజ్ నిలిచాడు.

తొలి రోజు ఆటలో భాగంగా 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును సర్ఫరాజ్ ఆదుకున్నాడు. ఈ క్రమంలో అతను మరో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ భావించగా.. కమ్‌లేశ్ మక్‌వానా ఔట్ చేశాడు. 

Also Read:ట్రిపుల్ సెంచరీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ మరో ఫీట్

రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతూ ఉత్తరప్రదేశ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి వార్తల్లోకి ఎక్కి సర్ఫరాజ్ ఖాన్ సంచలనం సృష్టించాడు. దగ్గు, జ్వరంతో బాధపడుతూ కూడా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగి ముంబై జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ముంబై జట్టు మూడు పాయింట్లను రాబట్టుకుంది. 

సర్ఫరాజ్ ఖాన్ 1997 అక్టోబర్ 22వ తేదీన ముంబై శివారులో జన్మించాడు. ఇంతకు ముందు అతను రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఇప్పుడు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాు. తిండిపై ఉన్న మక్కువ కారణంగా అతన్ని పాండా అని కూడా పిలుస్తారు. అయితే అతనికి కుట్టి ఎబీడీ అనే ముద్దు పేరు ఉంది. 

సర్ఫరాజ్ ఖాన్ 2014, 2016ల్లో అండర్ 19 ప్రపంచ కప్ జట్టుకు ఆడాడు. 22 ఏళ్ల అతను కుడిచేతి వాటం అగ్రెసివ్ బ్యాట్స్ మన్. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా. ఐపిఎల్ మ్యాచ్ ఆడిన అతి తక్కువ వయస్సు ఆటగాడు అతనే. ప్రస్తుతం ఐపిఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

తన బాల్యంలో ఎక్కువ కాలం అతను ఆజాద్ మైదాన్ లోని టెంట్ కిందే గడిపేవాడు. అక్కడ అతని తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ యువకులకు శిక్షణ ఇచ్చేవాడు. ఇక్బాల్ అబ్దుల్లా, కమ్రాన్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లను ముందుకు తెచ్చింది ఆయనే. టెంట్ కిందే ఎక్కవ కాలం గడపడం వల్ల సర్ఫరాజ్ కు క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. తండ్రి అతనిలో ఉన్న ఆసక్తిని గమనించి శిక్షణ ఇచ్చాడు. 

Also Read:ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?: జీవితంలో ఎక్కువ కాలం టెంట్ కిందే, తిండిపోతు

వర్షాకాలంలో మైదానానికి చేరుకోవడం బురద వల్ల సర్ఫరాజ్ కు కష్టంగా ఉండేది. దీంతో ప్రాక్టీస్ కోసం అతని ఇంటి పక్కనే సింథటిక్ పిచ్ ను ఏర్పాటు చేశారు. హరీష్ షీల్డ్ గేమ్ లో 45 ఏళ్ల నాటి సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా అతని పేరు వెలుగులోకి వచ్చింది. అతను 421 బంతుల్లో 439 పరుగులు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. తన 12 ఏళ్ల వయస్సులో హరీష్ షీల్డ్ గేమ్ లో 2009లో అతనికి మొదటి మ్యాచ్. 

ముంబై తరఫున అండర్ 19లో ఆడుతున్న క్రమంలో ప్రతిభ కారణంగా ఇండియా అండర్ 19 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో అండర్ 19లో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో 101 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. అండర్ 19లో చూపిన ప్రతిభ కారణంగా అతను ఐపిఎల్ లోకి అడుగు పెట్టాడు. 

2014లో బెంగాల్ పై జరిగిన మ్యాచ్ ద్వారా సర్ఫరాజ్ ముంబై జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత 2015 -16లో ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. అతను 11 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 535 పరుగులు చేశాడు. అప్పటికి అతను అత్యధిక స్కోరు 155 పరుగులు. తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసాడు.