కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచదేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.

ముఖ్యమైన టోర్నీలన్నీ వాయిదా పడటంతో క్రీడాకారులు క్వారంటైన్ సమయంలో తమలో దాగివున్న కొత్త టాలెంట్‌‌ను తీసుకువస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ కూడా తనలోని ఎడిటింగ్ స్కిల్స్‌ను చూపెట్టాడు.

Also Read:ఉదయాన్నే నిద్రలేవడం విసుగ్గా ఉందా: అలాంటి వారి కోసం సానియా టిక్‌టాక్ వీడియో

ఓ ఫోటోలో బ్యాగ్రౌండ్ ఒకే విధంగా కనిపించేలా.. ఓ వైపు వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు, ఇంకోవైపు విశ్రాంతి తీసుకున్నట్లు ఎడిటింగ్ చేశారు. ఈ ఫోటోను శుభ్‌మన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై పలువురు నెటిజన్లు శుభమన్ గిల్ ఎడిటింగ్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మాత్రం కొత్తగా స్పందించారు. ఆ ఎడిటింగ్ అతనే చేశారని భావిస్తున్నారా..? అంటూ కామెంట్ చేశారు.

Also Read:బుట్ట బొమ్మ పాటకు క్రికెటర్ల స్టెప్పులు: మొన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కెవిన్ పీటర్సన్

దీంతో శుభ్‌మన్, సారా మధ్య ఏదో ఉందనే వార్తలు మరోసారి ప్రచారంలోకి వచ్చాయి. సారానే ఈ ఎడిటింగ్ చేసి ఉంటారని కొందరు, వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ మరికొందరు కామెంట్‌లు చేస్తున్నారు. కాగా గతేడాది శుభమన్‌ కొత్త కారు కొన్న సందర్భంగా ఓ ఫోటో పోస్ట్ చేయగా.. సారా అతనికి కంగ్రాట్స్ చెప్పారు.

దీనిపై స్పందించిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌ను ఆటపట్టించేలా ఓ ఫన్నీ కామెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచే సారా, శుభ్‌మన్‌‌ను ఆటపట్టించేలా ఓ ఫన్నీ కామెంట్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచే సారా, శుభ్‌మన్‌ల మధ్య ఏదో ఉందనే వార్తలకు ప్రచారం కలిగింది.