లాక్‌డౌన్ కారణంగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడటంతో క్రీడాకారులంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. ఇంకొందరు  టిక్ టాక్ వీడియోలతో ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.

ఈ లిస్టులోకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేరింది. మార్చిలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి టిక్ టాక్ వీడియోలు చేయడం, ప్లాంక్ ఛాలెంజ్‌లను స్వీకరించడం చేస్తోంది సానియా. ఆమె చేస్తున్న వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.

Also Read:ఫెడ్ కప్ హార్ట్ విజేతగా సానియా రికార్డ్... ప్రైజ్ మనీ ఏం చేసిందంటే.

తాజాగా చేసిన ఓ టిక్‌టాక్‌లో  ఉదయాన్నే నిద్ర లేవడాన్ని గురించి ఫన్నీగా ఓ వీడియో  చేసింది. ఇందులో ఉదయాన్నే బాల్కనీలో నిలబడిన సానియా.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని చూస్తుంది.

వెంటనే ఆ వ్యక్తిని నిన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా అని ప్రశ్నించింది. మంగళవారం షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు దీనికి 34,000 వ్యూస్‌ లభించాయి. మరికొందరు సానియా స్కిల్స్‌కు వావ్, నైస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:అందాలు ఆరబోస్తూ డ్యాన్స్... ట్రోల్స్ కి షమీ భార్య ఘాటు రిప్లై

అంతకుముందు ఆమె ‘‘ బ్యూటీ మోడ్’’ ను ప్రయత్నిస్తూ చేసిన వీడియో‌కు మిలియన్ వ్యూస్ లభించాయి. కాగా అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. నిబద్ధత, గుండెధైర్యం ప్రదర్శిస్తూ గొప్ప విజయాలు అందించినందుకుగాను సానియాకి అరుదైన గుర్తింపు  లభించింది.

2020 సంవత్సరానికి గాను ఆసియా ఓసియానియా జోన్‌లో సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా చరిత్ర సృష్టించింది.