క్రికెట్‌ అంటే సచిన్‌, సచిన్‌ అంటే క్రికెట్‌.. క్రీడా ప్రపంచంలో సచిన్‌ టెండూల్కర్‌కు ఉన్న గౌరవం ఎలాంటిదో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్ చరిత్రపై చెరగని ముద్ర వేసిన సచిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బ్యాట్‌ పట్టిన ఈ క్రికెట్‌ మాస్టర్‌ తన విశ్వరూపాన్ని చూపించాడు..  

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇండియా మాస్టర్స్‌ తరఫున బరిలోకి దిగిన సచిన్‌ పాత రోజులను గుర్తు చేశారు. వడోదరలోని బీసీపీ స్టేడియంలో ఇటీవల జరిగి ఇండియా మాస్టర్స్ vs ఆస్ట్రేలియా మాస్టర్స్ మ్యాచ్‌లో సచిన్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా బరలిలోకి దిగిన సచిన్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 33 బంగుల్లోనే 64 పరుగులు చేసి పాత రోజులను గుర్తు చేశాడు. 

నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో తన బ్యాట్‌ పదును ఏమాత్రం తగ్గడం లేదని సచిన్‌ నిరూపించారు. 52 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే షాట్లతో దుమ్మురేపాడు. శరవేగంగా దూసుకొస్తున్న బంతులను అంతే వేగంగా బౌండరీలకు తరలించాడు. 194 స్ట్రైక్ రేట్‌తో తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. దీంతో సచిన్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సచిన్‌ బ్యాటింగ్‌ చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. సచిన్‌ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నా ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. మిగత ప్లేయర్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆసీస్ నిర్ధేశించిన 269 పరుగులను ఛేధించలేక 174 పరుగులకే పరిమితమైంది.

Scroll to load tweet…

సచిన్‌ క్రికెట్ ప్రస్థానం: 

అభిమానులు క్రికెట్‌ గాడ్‌గా పిలచుకునే సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ జీవితాన్ని 1989లో ప్రారంభించాడు. 100 అంతర్జాతీ సెంచరీలను సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్స్‌లో తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలవడం తన కెరీర్‌లో అతిపెద్దగా విజయంగా భావించిన సచిన్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయితే ఆ తర్వాత కూడా ఆడపాదడపా చారిటీ మ్యాచ్‌లలో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ లాంటి టోర్నీల్లో భాగంగా మరోసారి తన అద్భుత ఆటతీరుతో మెస్మరైజ్‌ చేశాడు. 

Scroll to load tweet…