నడవలేని స్థితిలో సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్.. భారత మాజీ క్రికెటర్ కు ఏమైంది?
Vinod Kambli : గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ 2013లో ముంబైలో డ్రైవ్ లో ఉండగా గుండెపోటుకు గురయ్యాడు. అలాగే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఏడాది క్రితం తన రెండు రక్తనాళాలకు యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నాడు.
Vinod Kambli : భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. అతని ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వీడియోలో మొదట పార్క్ చేసిన బైక్ సహాయంతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. అది కూడా కుదరకపోవడంతో అక్కడున్న వారి సాయం తీసుకున్నాడు.
వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా?
నరేంద్ర గుప్తా అనే నెటిజన్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం బాగాలేదు. కాంబ్లీ గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నాడు. గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని, అవసరమైన మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని కూడా పేర్కొన్నాడు.
కాగా, భారత్ తరఫున వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 2013 లో అతను గుండెపోటుతో బాధపడ్డాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. కాంబ్లీ తన చురుకైన క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు, కానీ చెడు అలవాట్ల కారణంగా అతను భారత జట్టు నుండి ఔట్ అయ్యాడు. కాంబ్లీ క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్‌కి బెస్ట్ ఫ్రెండ్, అయితే సచిన్ ఆర్థిక ఇబ్బందులకు కారణమైన కారణంగా వారి సంబంధం క్షీణించింది. అయితే, కొంత కాలం తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు.