Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: 13 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి.. విరాట్ కోహ్లీ కోరినందుకే ఇలా.. !

Virat Kohli: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టుల‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మైన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ.. రాజ్ కోట్ వేదిగా జ‌రిగే మూడో టెస్టులో ఆడ‌తాడ‌ని భావించారు. కానీ, సిరీస్ మొత్తానికి దూరమై షాకిచ్చాడు ! 
 

first time Virat Kohli has missed an entire Test series in his 13-year career, BCCI fully respects and supports Kohli's decision IND vs ENG RMA
Author
First Published Feb 10, 2024, 3:32 PM IST | Last Updated Feb 10, 2024, 3:32 PM IST

Virat Kohli - India vs England: ఇప్ప‌టికే హైద‌రాబాద్, విశాఖప‌ట్నం టెస్టుల‌కు దూర‌మైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ తో జ‌ర‌గ‌బోయే మిగిలిన మూడు టెస్టుల కు కూడా దూర‌మ‌య్యాడు. ఇంగ్లాండ్ తో జ‌రిగే చివ‌రి మూడు టెస్టుల‌కు జాతీయ సెలక్టర్లు శనివారం ప్రకటించిన జట్టులో కింగ్ కోహ్లీకి చోటు దక్కలేదు.

భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా తొలి టెస్టు ప్రారంభానికి ముందు బీసీసీఐ ఇంగ్లాండ్ తో జ‌రిగే తొలి రెండు టెస్టు మ్యాచ్ ల‌కు కింగ్ కోహ్లీ అందుబాటు లో ఉండ‌టం లేద‌ని పేర్కొంది. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జ‌ట్టులో చేర‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. మిగిలిన మూడు టెస్టుల‌కు ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో కూడా విరాట్ కోహ్లీకి చోటు క‌ల్పించ‌లేదు. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కు దూరంగా ఉండ‌నున్నాడ‌నీ, అత‌ని నిర్ణ‌యాన్ని బోర్డు గౌర‌విస్తుంద‌ని తెలిపారు.

రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..

'వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన సిరీస్ లోని మ్యాచ్ ల‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. కోహ్లీ నిర్ణయాన్ని భార‌త క్రికెట్ బోర్డు పూర్తిగా గౌరవిస్తుంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్లను జాతీయ సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. అయితే, వీరి ఫిట్ నెస్ ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుని తుది జ‌ట్టులో చోటుక‌ల్పించే అవకాశ‌ముంది.

విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల‌కు దూరంగా ఉంటార‌ని సిరీస్ ప్రారంభానికి ముందు ప్ర‌క‌టించిన బీసీసీఐ.. ఇప్పుడు కూడా అదే విష‌యాన్ని ప్ర‌స్తావించింది. విరాట్ ఆడ‌క‌పోవ‌డం వేనుకు ఇన్న కార‌ణాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌లేదు. త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో విరాట్ కోహ్లీ భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటున్నార‌ని తెలిపారు. కింగ్ కోహ్లీ నిర్ణ‌యాన్ని బీసీసీఐ గౌర‌విస్తుంద‌ని పేర్కొంది. అయితే, విరాట్ కోహ్లీ 13 ఏళ్ల టెస్టు కెరీర్ లో ఒక సిరీస్ మొత్తానికి దూరం కావ‌డం ఇదే మొద‌టిసారి.

సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం.. ఇంగ్లాండ్ తో 3 టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే.. !

చివరి 3 టెస్టులకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios