ఇంతకాలం మన లైఫ్ స్టైల్ కారణంగా వాయి, శబ్ధ కాలుష్యం ఏర్పడిందని.. కరోనా వైరస్ వల్ల అవన్నీ తగ్గుముఖం పట్టాయని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అందరూ స్వీయ నిర్భందలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

Also Read ఐసీసీ బెస్ట్ పుల్ షాట్ ట్వీట్: కోపమొచ్చి ట్రోల్ చేసిన రోహిత్ శర్మ...

కాగా... ఈ వైరస్ పరిస్థితిపై రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికే భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యల్లో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ, మన అందరం కలిసి చేసే పనులను రివర్స్ చేసి.. తనను తాను భూమాత నయం చేసుకుంటోంది’ అంటూ రోహిత్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

 

కరోనా వైరస్ సోకిన తర్వాతే మన దేశంలో వాయి, శబ్ద కాలుష్యాల తీవ్రత తగ్గిందని రోహిత్ పేర్కొన్నాడు. వెనిస్ హార్బర్ లో డాల్ఫిన్లు చక్కగా ఆడుకుంటున్నాయని చెప్పాడు. పందులు కూడా వీధుల్లో ప్రశాంతంగా తిరగగలుగుతున్నాయన్నాడు. రోమ్ ఫౌంటైన్స్ లో హంసలు విహరిస్తున్నాయని.. కాలుష్య స్థాయి ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోయిందని  చెప్పాడు. ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.